వైసీపీలో రెడ్డి ఎంపీ వ‌ర్సెస్ రెడ్డి ఎమ్మెల్యే… ర‌గ‌డ రోడ్డుకెక్కిందే..!  

reddy mp vs reddy mla political heat rises in ysrcp, chilakaluri peta,vinukonda,ysrcp,guntur politics,ap,political news,,political war,YSRCP mp,YSRCP mla,reddies, kasu mahesh reddy - Telugu Ap, Chilakaluri Peta, Guntur Politics, Jagan Mohan Reddy, Kasu Mahesh Reddy, Latest News, Political News, Political War, Reddies, Vinukonda, Ysrcp, Ysrcp Mla, Ysrcp Mp

గుంటూరు వైసీపీలో ఇప్ప‌టికే ప‌లు నియోజ‌క వ‌ర్గాల్లో విబేధాలు రోడ్డుకెక్కాయి.ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేదు.

TeluguStop.com - Reddy Mp Vs Reddy Mla Political Heat Rises In Ysrcp

ఇప్ప‌టికే తాడికొండ‌, చిల‌క‌లూరిపేట‌, వినుకొండ, పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌ల మ‌ధ్య ఏ మాత్రం పొస‌గ‌డం లేదు.ఇక ఇప్పుడు ఈ లిస్టులోకి గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గం కూడా చేరిపోయింది.

రెడ్డి ఎంపీ కాసు మ‌హేష్‌రెడ్డి వ‌ర్సెస్ మ‌ధ్య విబేధాలు రోడ్డెక్కాయి.కాసు మహేష్‌రెడ్డి సీఎం జ‌గ‌న్‌కు స‌న్నిహితుడు.

TeluguStop.com - వైసీపీలో రెడ్డి ఎంపీ వ‌ర్సెస్ రెడ్డి ఎమ్మెల్యే… ర‌గ‌డ రోడ్డుకెక్కిందే..-Political-Telugu Tollywood Photo Image

అలాగే రాంకీ గ్రూప్ సంస్థల అధినేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా జ‌గ‌న్‌కు ఎంత ఆప్తుడో ప్ర‌త్యేకంగా చెప్పక్క‌ర్లేదు.గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న జ‌గ‌న్ కోరిక మేర‌కు న‌ర‌సారావుపేట సీటు త్యాగం చేశారు.

ఎన్నిక‌ల అనంత‌రం జ‌గ‌న్ ఆయ‌న్ను రాజ్య‌స‌భ‌కు పంపారు.జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక రాంకీ గ్రూప్ సంస్థ‌ల‌కు ప‌లు కాంట్రాక్టులు ల‌భించాయి.ఈ ప్రాజెక్టుల్లో ప‌ల్నాడులో రోడ్ల నిర్మాణంతో పాటు మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టే కాంట్రాక్టు కూడా వ‌చ్చింది.ప‌ల్నాడులో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్ప‌టికే రోడ్ల ప‌రిస్థితి దారుణంగా ఉంది.

రాంకీ ఈ ప్రాజెక్టుల‌ను ద‌క్కించుకున్నా ప్ర‌భుత్వం నుంచి నిధులు విడుద‌ల కాక‌పోవ‌డంతో అవి దారుణంగా తయారయ్యారు.

దీంతో గుర‌జాల ఎమ్మెల్యే కాసు మ‌హేష్‌రెడ్డి అయోధ్య రామిరెడ్డికి చెందిన కాంట్రాక్ట్ సంస్థ‌పై ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ విరుచుకు ప‌డ్డారు.ఇప్ప‌టికే మూడు వారాలు అయినందున ఇక తాను స‌హించ‌న‌ని.ఈ నెల 29న తుమ్మ‌ల చెరువు టోల్‌గేట్‌ను ముట్ట‌డిస్తామ‌ని కూడా ఆయ‌న చెప్పారు.

అయితే అది రాంకీ సంస్థ ఆధీనంలోనే ఉంది.ప్ర‌జా స‌మ‌స్య‌ల కోస‌మే మ‌హేష్‌రెడ్డి ఈ వార్నింగ్ ఇవ్వ‌లేద‌ని.

పార్టీలోనూ, ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న అంత‌ర్గ‌త కార‌ణంగానే మ‌హేష్‌రెడ్డి ఈ వార్నింగ్ ఇచ్చాడ‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అయోధ్య రామిరెడ్డి గ‌తంలో న‌ర‌సారావుపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

ప‌ల్నాడు రాజ‌కీయాల్లో ఆయ‌న‌కు గ్రిప్ ఉంది.ఈ ఇద్ద‌రికి ఎక్క‌డో తేడా రావ‌డం వ‌ల్లే చెడంద‌ని పార్టీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు.

#Ysrcp #Ysrcp Mp #YSRCP MLA #Vinukonda #Guntur Politics

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Reddy Mp Vs Reddy Mla Political Heat Rises In Ysrcp Related Telugu News,Photos/Pics,Images..