ఇదేంటి జగనన్నా ? రెడ్ల బాధ చూడన్నా ! 

ఇప్పటికే సవాలక్ష తల పోట్లను ఎదుర్కొంటున్న ఏపీ సీఎం జగన్ కు ఇప్పుడు ఓ సమస్య వచ్చి పడింది.ముఖ్యంగా మొదటి నుంచి తన తండ్రికి, ఆ తరువాత తనకు అండదండలు అందిస్తూ వస్తున్న రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు అసంతృప్తి గా ఉండడం చర్చనీయాంశం అవుతోంది.

 Reddy Caste Angry On Jagan Behaviour , Reddy, Caste, Bc, Ysrcp, Jagan, Ap Cm, Ca-TeluguStop.com

జగన్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే వరకు ఎన్నెన్నో కష్టాలు పడ్డారు.అప్పటి నుంచి జగన్ కు ఆ సామాజిక వర్గమే అండగా ఉంటూ వచ్చింది.

కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి జగన్ తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, పూర్తిగా రెడ్లకే పదవులు, ప్రాధాన్యత ఇస్తే మిగతా సామాజిక వర్గాల నుంచి వస్తుందనే ఉద్దేశం తో జగన్ రెడ్లకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా పూర్తిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ, పదవుల్లోనూ వారికే పెద్దపీట వేస్తూ ఉండడం, మంత్రివర్గంలోనూ రెడ్లకు కీలకమైన పదవులు దక్కకపోవడం, రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం పెడుతూ బీసీ, ఎస్సీ ,ఎస్టీ ,మైనారిటీలను దగ్గర చేసుకునేందుకు జగన్ ప్రయత్నించడం వంటి వ్యవహారాలు అన్నీ ఆ సామాజికవర్గం నేతల్లో ఆగ్రహాన్ని పెంచుతున్నాయి.

జగన్ అధికారంలోకి వస్తే తమకు తగిన ప్రాధాన్యత ఉంటుందని భావిస్తూ, ఆర్థికంగానూ, సామాజికంగానూ అండదండలు అందించిన రెడ్లు ఇప్పుడు మాత్రం జగన్ తీరుపై ఇప్పుడు అసంతృప్తితో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.

ఇటీవల భర్తీ చేసిన ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ తగిన ప్రాధాన్యం రెడ్లకు దక్కలేదు.నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత వంటి వ్యవహారాలు ఇప్పుడు ఆ సామాజిక వర్గం నేతల్లో చర్చనీయాంశం అవుతోంది.

జగన్ ఇదే విధంగా రాబోయే ఎన్నికల నాటికి పూర్తిగా రెడ్డి సామాజిక వర్గం జగన్ కు దూరం అవుతారని, ముందు ముందు ఇవి ఇబ్బంది పెట్టే అవకాశం ఉందనే అభిప్రాయాలు ఇప్పుడు ఆ సామాజికవర్గం నుంచి వినిపిస్తున్నాయి.ఇప్పుడు రెడ్ల బాధ జగన్ ఏ విధంగా తీరుస్తారో ?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube