సెల్ ఫోన్ లో సోలో సినిమా… రెడ్ జోన్ తో కొత్త ప్రయోగం  

Red Zone Movie Mobile Phone - Telugu Corona Effect, Lock Down, Red Zone, Red Zone Movie Create Trending In Tollywood

హైదరాబాదీ సినిమా అనేది టాలీవుడ్ లో ఒక భాగమనే సంగతి అందరికి తెలిసిందే.చాలా మంది హైదరాబాదీ హిందీ సినిమాలు చేస్తూ ఉంటారు.

 Red Zone Movie Mobile Phone

వాటిలో కొన్ని మంచి హిట్స్ అయినవి కూడా ఉన్నాయి.తెలంగాణలో హైదరాబాదీ మూవీస్ కి మంచి గుర్తింపు ఉంది.

ఈ హైదరాబాదీ మూవీస్ లో అక్కడక్కడ తెలుగు కూడా ఉంటుంది.అయితే లాక్ డౌన్, కరోనా ఎఫెక్ట్ నేపధ్యంలో ఎవరూ చేయని ప్రయోగాలు టాలీవుడ్ లో చేస్తున్నారు.

సెల్ ఫోన్ లో సోలో సినిమా… రెడ్ జోన్ తో కొత్త ప్రయోగం-Movie-Telugu Tollywood Photo Image

ఇప్పటికే ఆర్జీవీ కరోనా వైరస్ అంటూ ఒకస ఇనిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.ఇప్పుడు కుర్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా కరోనా వైరస్ నేపధ్యంలో సినిమా చేస్తున్నాడు.

మరో వైపు దర్శకుడు శేషు కెఏంఆర్ కూడా రెడ్ జోన్ అంటూ కరోనా ఒక సినిమా చేశాడు.

ఈ సినిమాకి సంబదించిన సాంగ్ ట్రైలర్, మూవీ ట్రైలర్ గా తాజాగా రిలీజ్ చేశారు.

అయితే ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది.ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ లేడు.

దర్శకుడు దర్శకత్వం చెయ్యలేదు.కాస్ట్ అండ్ క్రూ ఒకరితో ఒకరు కలిసి పని చెయ్యలేదు.

ప్రతి నటుడు, నటి తమ ఇళ్లలో ఉంటూ తమ మొబైల్ ఫోన్ సహాయంతో సెల్ఫీ మోడ్‌లో డైలాగ్స్ చెప్పి వాటిని సింక్ సౌండ్‌లో రికార్డు చేసి ఏకంగా ఒక కథనే సృష్టించారు.దీనికి పాట ముంబయి, పూణే గౌరవ్ ప్రథం అనే యువకులు సమకూర్చి తమ ఊళ్ళోనే తయారు చేసారు.

అదే విథంగా ఎడిటింగ్, సౌండ్, మిక్సింగ్ మిగతా పనులు చెన్నై, హైదరాబాద్ నగరాలలో జరిగాయి.లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించకుండా ఇలాంటి కష్ట కాలంలో కూడా క్రియేటివిటీ ఉంటే సినిమా చేసి చూపించొచ్చు అని రెడ్ జోన్ సినిమాతో ప్రూవ్ చేశాడు.

రెడ్ జోన్ లో అజిజ్ నాసర్, బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా, సూఫీ ఖాన్, ఆర్ కే మామా, శివ మామిడి తదితరులు నటించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Red Zone Movie Mobile Phone Related Telugu News,Photos/Pics,Images..

footer-test