అధిక బరువు సమస్యతో బాధ పడేవారు శరీరంలో కొవ్వును కరిగించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.తినడం మానేసి మరీ చెమటలు పట్టేలా వ్యాయామాలు చేస్తుంటారు.
అయితే అలాంటి వారు రెడ్ వైన్ తీసుకుంటే.త్వరగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు.
మద్యం ఆరోగ్యానికి హానికరం అయినప్పటికీ.రెడ్ వైన్ విషయంలో అది నిజం కాదు.
ఎందుకంటే, రెడ్ వైన్‌తో ఆరోగ్య పరంగానూ, సౌందర్య పరంగానూ బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ముఖ్యంగా అధిక బరువును త్వరగా తగ్గించుకోవాలి అని అనుకునే వారు ప్రతి రోజు తగిన మోతాదులో రెడ్ వైన్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే, రెడ్ వైన్‌లో ఎలాజిక్ అనే ఆమ్లం శరీరంలో పేరుకుపోయి ఉన్న కొవ్వును కరిగించేస్తుంది.అందుకే బరువు తగ్గాలనుకునే వారు రెడ్ వైన్ తీసుకోవడం మంచిది.బరువు తగ్గడమే కాదు.రెడ్ వైన్‌తో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
రెగ్యులర్‌గా రెడ్ వైన్ తీసుకోవడం వల్ల మనిషి జీవిత కాలంలో పెరుగుంది.
అలాగే రెడ్ వైన్‌లో ఉండే కొన్ని పోషకాలు శరీర రోగ నిరోధక వ్యవస్థను పెంపొందించి.
వృద్ధ్యాప్యాన్ని ఆలస్యం అయ్యేలా చేస్తుంది.రెడ్ వైన్ సేవించడం వల్ల చర్మం ఎప్పుడూ యవ్వనంగా, కాంతివంతంగా ఉంటుంది.
ప్రతి రోజు రెడ్ వైన్ తీసుకోవడం వల్ల అందులో ఉండే టానిన్లు గుండె పోటు, ఇతర గుండె జబ్బులు రాకుండా రక్షిస్తాయి.మరియు బ్లడ్ షుగర్ లెవల్స్ కూడా అదుపులో ఉంటాయి.
అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువగా సేవిస్తే మాత్రం డేంజర్‌లో పడిపోతారు.రెడ్ వైన్‌ను రోజు తాగినా మితంగా మాత్రమే తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అదే సమయంలో కెమికల్ బేస్డ్ ఆల్కహాల్ కు బదులుగా గ్రేప్ వైన్, యాపిల్ వైన్ వంటివి తీసుకోవడం మంచిదని అంటున్నారు.