సంచలనంగా సోనియా "రెడ్ శారీ"

సోనియా గాంధీ గురించి తెలుసుకోవడానికి, ఆమె జీవితంలో ఎత్తు పల్లాల పై అవగాహన కలిగేందుకు ఒక పుస్తకం మార్కెట్ లోకి వచ్చింది.విషయం ఏమిటంటే ఎక్కడో ఇటలీలోని ఓ సాధారణ కుటుంబంలో పట్టిన సోనియా.

 “red Saree” Sonia Gandhi Biography-TeluguStop.com

ఆ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఎలా అధినేత కాగలిగారు.ఆమె జీవితంలోని ఎత్తుపల్లాలేంటి.

అన్న విషయాలా పై స్పానిష్ రైటర్ జేవియర్ మోరో ఏడేళ్ల క్రితం ఒక పుస్తకం రచించాడు.దానికి “రెడ్ శారీ: ఎ డ్రమటైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ సోనియాగాంధీ” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ సైతం పెట్టాడు.అదే క్రమంలో 2010లోనే ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ బాషలో విడుదల చేసే విశ్వప్రయత్నమే చేశాడు, కానీ ఫలితం కనపడలేదు.అప్పట్లో కొంగర్స్ ప్రభుత్వం అధికారంలో ఉండడమే దీనికి కారణం అంటూ వార్తలు సైతం గుప్పు మన్నాయి.

ఇదిలా ఉంటే ఐదేళ్ల తర్వాత ఇన్నాళ్లకు ఇండియాలో ఈ బుక్ రిలీజైంది.ఇందులో ఎన్నో ఆసక్తికర విషయాలను పొందుపరిచాడు రచయిత అందులో ముఖ్యంగా రాజీవ్ హత్య తర్వాత సోనియా వెళ్లిపోవాలనుకుందా.? ఎమర్జెన్సీ హయాంలో సోనియా ఎలాంటి పాత్ర పోషించారు.? ఇటలీ సోనియా -ఇండియన్ మేనకా మధ్య సంబంధాలు ఎలా ఉండేవి.? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ పుస్తకంలో దొరుకుతాయి.మరి ఈ పుస్తకంపై కొంగ్రెస్ పార్‌ట్ వారే పెదవి విరుస్తున్నారు.

పుస్తకంలో ఎలాంటి అభ్యంతరకర విషయాలున్నా కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరికలు సైతం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube