ఆగిపోయిన రెడ్ చిత్రం.. ఇక్కడ కాదు అక్కడ!

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెడ్’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.అయితే కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

 Red Movie Remake Stalled For Now, Ram Pothineni, Red Movie, Kishore Tirumala, Si-TeluguStop.com

ఇక థియేటర్లు ఇంకా తెరుచుకోకపోవడంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా తాజాగా రెడ్ చిత్రం ఆగిపోయిందనే వార్తి ఫిలిం సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.

రిలీజ్‌కు రెడీగా ఉన్న చిత్రం ఆగిపోవడం ఏమిటని అనుకుంటున్నారా?

అయితే ఆగిపోయింది తెలుగు రెడ్ చిత్రం కాదండోయ్.రామ్ నటిస్తున్న రెడ్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు అక్కడి దర్శకనిర్మాతలు రెడీ అయ్యారు.

ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా జరుపుకున్న ఈ సినిమా కథ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాకు అంతగా నచ్చలేదట.దీంతో ఈ సినిమా షూటింగ్‌ను ఆపేశారట చిత్ర యూనిట్.

స్క్రిప్టులో కొన్ని మార్పులు చేసేందుకు సిద్ధార్థ్ స్వయంగా తానే పూనుకున్నాడని, అందుకే ఈ సినిమా షూటింగ్‌ను ప్రస్తుతానికి ఆపేశామని సదరు చిత్ర యూనిట్ పేర్కొంది.వర్ధన్ కేల్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో సిద్ధార్థ్ డ్యుయెల్ రోల్ చేయనున్నాడు.

కాగా రామ్ పర్ఫార్మెన్స్ రెడ్ చిత్రానికి అదిరిపోయే క్రేజ్‌ను తీసుకురావడం ఖాయమని, ఈ కథ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని తెలుగు రెడ్ చిత్ర దర్శకుడు కిషోర్ తిరుమల ధీమా వ్యక్తం చేస్తున్నాడు.ఇక ఈ సినిమాలో అందాల భామలు నివేథా పేతురాజ్, మాళవికా శర్మ, అమృత అయ్యర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కాగా మరో బ్యూటీ హెబ్బా పటేల్ ఈ సినిమాలో ఓ హాట్ ఐటెం సాంగ్‌లో కనిపిస్తుంది.మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను స్రవంతి రవికిషోర్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

సంక్రాంతి బరిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రామ్ అండ్ టీమ్ రెడీ అయ్యారు.మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube