పండగకు పంగనామం పెడితే నేరుగా ఇంట్లోనే!

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘రెడ్’ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేద్దామని చిత్ర యూనిట్ భావించగా, కరోనా రూపంలో వారికి పెద్ద అడ్డంకి వచ్చి పడింది.

 Red Movie May Release Ott If Not In Sankranthi Race, Red Movie, Ram Pothineni, O-TeluguStop.com

ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే అంశంపై అటు చిత్ర యూనిట్ కూడా క్లారిటీ ఇవ్వలేకపోతుంది.ప్రస్తుతానికి ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ గట్టిగా ప్రయత్నిస్తోంది.

కానీ సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం కూడా ఉండటంతో ఈ పండగ సమయంలో తమ చిత్రాన్ని రిలీజ్ చేయాలా వద్దా అనే ఆలోచనలో రెడ్ చిత్ర యూనిట్ పడింది.సోలోగా దిగితే తమ చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుందని, కానీ పోటీ మధ్యలో దిగితే ఎలాంటి ఫలితం వస్తుందో అనే సందేహం చిత్ర యూనిట్‌లో నెలకొంది.

దీంతో ఈ సినిమాను పండగకు రిలీజ్ చేయాలా వద్దా అని వారు తర్జనభర్జన పడుతున్నారు.రామ్ డ్యుయెల్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాను కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.

ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు, సాంగ్స్ సినిమాపై మరిన్ని అంచనాలను క్రియేట్ చేశాయి.ఒకవేళ ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయలేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫాంపై రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఈ సినిమాకు భారీ ఆఫర్లను అందించినా, ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ అంగీకరించలేదు.దీంతో సంక్రాంతి సీజన్ ఈ సినిమాకు కీలకంగా మారింది.

మరి పండగకు ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుందా, లేక పంగనామం పెట్టి ఓటీటీలో కనబడుతుందా అనేది తేలాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube