షియోమి రెడ్ మీ మొబైల్స్ కోసం వచ్చేసాయి కొత్త సూపర్ అప్డేట్స్

చైనా ఫోన్లకి తిట్టేది తిట్టుకుంటారు కానీ మళ్ళీ రెడ్ మీ మొబైల్స్ నే కొంటారు భారతీయులు.ప్రస్తుతం భారతదేశంలో నెం ర్యాంకులో కొనసాగుతోంది షియోమి.

 Red Mi Introduces Miui -9 : Interesting Features-TeluguStop.com

సామ్ సాంగ్ తరువాత రెండోవ అతిపెద్ద మార్కెట్ షేర్ ఈ సంస్థది.తక్కువ రేటులో సూపర్ ఫీచర్స్ అందించే రెడ్ మీ, తన కస్టమర్లకు కొత్త అనుభూతి ఇచ్చేందుకు కొన్ని కొత్త అప్డేట్స్ ఇచ్చింది.MIUI-9 ఆపరేటింగ్ సిస్టంని విడుదల చేసింది రెడ్ మీ.ఇందులో కొత్తగా వచ్చిన అప్డేట్స్ ఏంటో చూడండి.

* రెడ్ మీ లోకి Split Screen మోడ్ వచ్చేసింది.అంటే మీరు స్క్రీన్ ని రెండు భాగాలుగా విభజించి, ఒకేసారి రెండు యాప్స్ ని వాడుకోవచ్చు.

* వాట్సాప్ లో నాలుగైదు మెసేజ్లు వచ్చి ఉన్నాయి, మీరు అందులో ఒక్కరికే మాత్రమె రెప్లై ఇవ్వాలి అనుకోండి, నోటిఫికేషన్ బార్ నుంచే రిప్లై ఇవ్వవచ్చు.అక్కడే మీకు అతను/ఆమె పంపిన మెసేజ్ కనబడుతుంది కూడా.

* లాంచర్ ని కూడా ఇస్తోంది రెడ్ మీ.అంటే ఇక మీరు బయటి నుంచి లాంచర్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.ఈ లాంచర్ గూగుల్ నౌ తరహాలో మీకు సేవలందిస్తుంది.

* గ్యాలరీలో సెర్చ్ ఆప్షన్ కూడా వచ్చేసింది.

మీరు ఉదాహరణకి హుస్సేన్ సాగర్ దగ్గర మూడు నెలల క్రితం ఓసారి, నెల క్రితం ఓసారి ఫోటోలు దిగారు అనుకోండి.వాటిని వెతుక్కోవాలంటే ఫోటోలన్ని చూసుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు.

Hussain Sagar అని టైప్ చేయగానే మీరు అక్కడ ఎప్పుడెప్పుడు ఎన్ని ఫోటోలు దిగారు, అన్ని ఫోటోలు చూపిస్తుంది గ్యాలరి.

* ఒక smart assistant ని కూడా అందిస్తోంది రెడ్ మీ.ఎన్నో పనులు చకచక చేసుకోవచ్చు.అయితే ఇది సిరి లాంటి అసిస్టంట్ కాదు.

* సెక్యూరిటి యాప్ లో కొత్త ఫీచర్స్ యాడ్ చేసింది షియోమీ.ఏ యాప్ ఎంత బ్యాటరీ తీసుకుంటుందో లెక్కలతో సహా చూడొచ్చు ఇకనుంచి.

దీంతో మీరు బ్యాటరి కోసం ఏ యాప్ వాడాలో, ఏ యాప్ వాడకూడదో నిర్ణయించుకోవచ్చు.

* కొత్త గేస్చర్ షార్ట్కట్స్.

కొత్త థీమ్స్ అందుబాటులోకి వచ్చాయి.అలాగే యాప్ ఐకాన్స్ కి కొత్త యానిమేషన్స్ జత చేసారు.

* బ్యాటరి చార్జింగ్ త్వరగా అయ్యేలా చేసారు.హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్ లో మార్పులు వచ్చాయి.

ఈ అప్డేట్ ఈ రెడ్మి ఫోన్స్ కి రానుంది :

Mi 6, Mi 5s Plus, Mi 5s, Mi 5c, Mi 5, Mi 4S, Mi 4c, Mi 4, Mi 3, Mi 2/2S, Mi MIX, Mi Max 2, Mi Max, Mi Note 2, Mi Note/Pro, Mi Pad 2, Mi Pad 1, Redmi Note 4X (MTK), Redmi Note 4X (SD), Redmi Note 4, Redmi Note 3 (MTK), Redmi Note 3 (SD), Redmi Note 2, Redmi Note, Redmi Pro, Redmi 4X, Redmi 4A, Redmi 4, Redmi 4 Prime, Redmi 3S/Prime, Redmi 3, Redmi 2A, Redmi 2/Prime, Redmi 1S, Redmi 1.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube