క‌రోనా నివార‌ణ‌కు ఎర్ర చీమ‌ల చ‌ట్నీ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సుప్రీంకోర్టు..

కొవిడ్ వైరస్ కట్టడికి ఫార్మా కంపెనీలు ఇప్పటికే వ్యాక్సిన్స్ రూపొందించగా, మన దేశంతో పాటు ఇతర దేశాల్లోనూ ప్రజలు టీకాలు తీసుకుంటున్నారు.మన దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.

 Red Ant Chutney For Corona Prevention Supreme Court Made Sensational Comments, S-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆధునిక వ్యాక్సిన్ కాకుండా జనాలు ఇతర సంప్రదాయ వైద్యం కూడా తీసుకుంటున్నారు.ఏపీలో ఇప్పటికే ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ అవుతోంది.

అందుకు ఏపీ రాష్ట్ర సర్కారు అనుమతి కూడా ఇచ్చింది.కాగా, కరోనా వైరస్ కట్టడికి ఎర్ర చీమల చట్నీ బాగా ఉపయోగపడుతుందని ఓ పిటిషనర్ సుప్రీం కోర్టుకు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే ఎర్ర చీమల చట్నీని అందరూ ఉపయోగించాలే ఆదేశాలించాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.విచారణ సందర్భంగా ‘సుప్రీం’ ధర్మాసనం ఏ విధంగా స్పందించిందంటే.

కొవిడ్ మహమ్మారి కట్టడికి ఎర్ర చీమల చట్నీని అందరూ ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేయబోమమని పేర్కొంది.పిటిషన్‌ను కొట్టి పారేస్తూ, సంప్రదాయ జ్ఞానాన్ని అందరూ పాటించబోరని తెలిపింది.

ఇకపోతే మన దేశంలోని ఏజెన్సీ ప్రాంతాలున్న రాష్ట్రాల్లో ఎర్ర చీమలను ఇమ్యూనిటీ పవర్ పెంచే ఫుడ్ ఐటమ్స్‌గా తీసుకుంటు ఉంటారు.ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో రెండ్ యాంట్స్ చట్నీతో పాటు సూప్ తయారు చేసుకుని తింటుంటారు.

అలా వాటిని తింటే ఫ్లూ లక్షణాలన్నీ మటుమాయమైపోతాయని గిరిజనుల నమ్మకం.

Telugu Corona, Covid, Odishaengineer, Supreme, Red Chutney-Latest News - Telugu

ఈ నేపథ్యంలోనే ఎర్ర చీమలకు పచ్చి మిరపకాయలు కలిపి తయారు చేసిన చట్నీని కరోనాకు మందుగా వాడొచ్చని ఒడిశా ఇంజినీర్ నయాధర్ పథియాల్ తెలిపాడు.ఈ విషయమై ఒడిశా హై కోర్టులో పిటిషన్ కూడా వేశారు.అయితే, కోర్టు పిటిషన్‌ను కొట్టి పారేసింది.

దాంతో పిటిషనర్ సుప్రీం కోర్టుకు రాగా, ఇక్కడా ధర్మాసం పిటిషన్‌ను కొట్టేసింది.ఎర్రచీమల చట్నీ సంప్రదాయ ఔషధంగా వాడాలనుకునేవారు వాడొచ్చని, దాని పర్యవసానాలు వాడిన వారికి మాత్రమే అనుభవంలోకి వస్తాయని, అయితే దేశవ్యాప్తంగా అందరూ ఈ ఎర్ర చీమల చట్నీని తీసుకోవాలని ఆదేశించబోమని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ హిమా కీహ్లీతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం తెలిపింది.

ఈ క్రమంలోనే పిటిషనర్‌కు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube