రెడ్ అలెర్ట్: ముంబైలో రెండు రోజులు అన్నీ బంద్!  

red alert, mumbai city, two days strike, heavy rains, IMD Announced Red alert in Mumbai - Telugu Heavy Rains, Imd Announced Red Alert In Mumbai, Mumbai City, Red Alert, Two Days Strike

మహారాష్ట్ర రాజధాని ముంబై వాసులను ఒకవైపు కరోనా మహమ్మారి కలవరపెడుతుంటే మరోవైపు భారీ వర్షాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి.భారత వాతావరణ శాఖ ముంబై లో రెడ్ అలర్ట్ ప్రకటించింది.

TeluguStop.com - Red Alert Mumbai Heavy Rains

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

తూర్పు కొంకణ్‌, థానే జిల్లాలతో పాటు ముంబైలో కూడా భారీ వర్షాలు కురుస్తుండగా రాబోయే రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

TeluguStop.com - రెడ్ అలెర్ట్: ముంబైలో రెండు రోజులు అన్నీ బంద్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

నిన్న కురిసిన భారీ వర్షాలకు ముంబైలోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడగా మరికొన్ని ప్రాంతాల్లో నిలిచిపోయిన నీరు చెరువులను తలపిస్తోంది.

ఐఎండీ టైమ్స్ ఆఫ్ ఇండియా, సమతా నగర్ పోలీస్ స్టేషన్, హైవే ముంబై, ఉత్తర కొంకణ్ ప్రాంతాలలో రెడ్ అలర్ట్ అమలులో ఉంటుందని పేర్కొంది.అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్ప పీడనం వల్ల ముంబైలో నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి.

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లెక్కల ప్రకారం గత 14 గంటల్లో 230 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది.భారీ వర్షాల వల్ల నగరంలోని పలు సేవలకు అంతరాయం కలిగింది.

మహారాష్ట్ర ప్రభుత్వం ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అత్యవసర సేవలు మినహా ఇతర కార్యాలయాలకు సెలవు ప్రకటించింది.వర్షాల వల్ల పలు రైళ్లను సైతం నిలిపివేసినట్లు సమాచారం అందుతోంది.

#Red Alert #Heavy Rains #IMDAnnounced #Mumbai City #Two Days Strike

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Red Alert Mumbai Heavy Rains Related Telugu News,Photos/Pics,Images..