ఈ మూడు సినిమాల పరిస్థితి ఏంటీ?

కరోనా కారణంగా చాలా సినిమాలు డైరెక్ట్‌ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్‌ ఎంతగానో ప్రయత్నించినా కూడా దాదాపు పది నెలలుగా థియేటర్లు లేక పోవడంతో పూర్తి అయిన సినిమాలకు భారీగా వడ్డీ నష్టం అనే ఉద్దేశ్యంతో సినిమాను ఓటీటీలకు అమ్మేసిన వారు చాలా మంది ఉన్నారు.

 Red 30 Rojullo Preminchadam Ela Uppena Movies Release Date-TeluguStop.com

కాని కొందరు మాత్రం తమ సినిమాలు థియేటర్లలోనే విడుదల అవ్వాలని భీష్మించుకు కూర్చున్న వారు కొందరు ఉన్నారు.వారిలో ముఖ్యులు రామ్‌, ప్రదీప్‌ మరియు వైష్టవ్‌ తేజ్‌.

ఈ ముగ్గురు హీరోలు కూడా వారు చేసిన మూడు సినిమాల విషయంలో ఎలాంటి నిర్ణయాన్ని క్లారిటీగా ఇవ్వడం లేదు.వీరు నటించిన రెడ్‌, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మరియు ఉప్పెన ఈ మూడు సినిమాలను జనాలు మర్చే పోతున్నారు.

 Red 30 Rojullo Preminchadam Ela Uppena Movies Release Date-ఈ మూడు సినిమాల పరిస్థితి ఏంటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆమద్య తెగ హడావుడి చేసిన ఈ మూడు సినిమాలు ప్రస్తుతం మాత్రం పెద్దగా చర్చలో కూడా లేకుండా పోయాయి.

ఇప్పుడు ఈ సినిమాలను విడుదలకు సిద్దం చేస్తే ఇవి వచ్చి పోయాయి కదా అనేట్లుగా జనాలు ఉన్నారు.

మూడు సినిమాల పరిస్థితి ఏంటీ అనే విషయంలో ఇంకా కూడా క్లారిటీ రావడం లేదు.అదుగో ఓటీటీ ఇదుగో థియేట్రికల్‌ రిలీజ్‌ అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈమూడు సినిమాల కంటే వెనుక రెడీ అయిన సోలో బ్రతుకే సోబెటర్‌ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.ఈ నెల క్రిస్మస్‌ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

కాని ఇప్పటి వరకు ఆ మూడు సినిమాల విడుదల విషయంలో కనీసం చర్చలు కూడా జరుగుతున్నట్లగా అనిపించడం లేదు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఉప్పెన మరియ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలకు భారీగా ఓటీటీ ఆఫర్‌ లు వస్తున్నాయి.

కాని ఇద్దరు హీరోలు కూడా పరిచయం అవుతున్న సినిమాలు అవ్వడం వల్ల ఓటీటీకి ఇష్టం వ్యక్తం చేయడం లేదు.ఈ మూడు సినిమాలు మరెన్నిర ఓజులు వెయిట్‌ చేయాలో చూడాలి.

#Mega Hero #30Rojullo #Ram Hero #Vaishnav Tej #Corona Movies

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు