మళ్లీ రికార్డు బద్దలు కొట్టిన బాలాపూర్‌ లడ్డు  

Records Create Balapure Ganesh Laddu-balapure Ganesh Laddu

వినాయక నిమజ్జనం వచ్చింది అంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు అంతా ఎంతో ఆసక్తిగా చూసేది బాలాపూర్‌ లడ్డు వైపే.సంవత్సరం సంవత్సరం లక్షలకు లక్షలు పెరుగుతూ వస్తున్న విషయం తెల్సిందే.1994లో రూ.450 కి అమ్ముడు పోయిన బాలాపూర్‌ లడ్డు గత ఏడాది 2018లో రూ.16.6 లక్షలకు కొలను మోహన్‌ రెడ్డి దక్కించుకున్నాడు.

Records Create Balapure Ganesh Laddu-balapure Ganesh Laddu Telugu Viral News Records Create Balapure Ganesh Laddu-balapure Laddu-Records Create Balapure Ganesh Laddu-Balapure Laddu

ఇక ఈసారి 20 లక్షల వరకు వెళ్లే అవకాశం ఉందని అంతా భావించారు.అయితే గత ఏడాది లడ్డు పాట పాడిన కొలను కుటుంబకు చెందిన వ్యక్తే ఈసారి కూడా లడ్డును దక్కించుకున్నాడు.

ఈసారి వేలం పాటను నిర్వహించిన నిర్వాహకులకు గత ఏడాది కంటే ఎక్కువగానే అమ్మాలని అనుకున్నారు.20 లక్షల వరకు అనుకున్నారు.కాని కొలను రాం రెడ్డి అనే భక్తుడు ఈసారి లడ్డును 17.6 లక్షలకు కొనుగోలు చేశాడు.

Records Create Balapure Ganesh Laddu-balapure Ganesh Laddu Telugu Viral News Records Create Balapure Ganesh Laddu-balapure Laddu-Records Create Balapure Ganesh Laddu-Balapure Laddu

గత ఏడాది కంటే ఈసారి ఒక లక్ష రూపాయలు మాత్రమే ఎక్కువ అయ్యింది.అయితే మళ్లీ బాలాపూర్‌ లడ్డు రికార్డును అయితే దక్కించుకుంది కాని, స్థానికులకు నిరాశను కలిగించింది.

20 లక్షల వరకు రేటు వెళ్తుందనుకుంటే ఆ స్థాయికి వెళ్లలేదని నిరుత్సాహంను వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు