బాహుబలి నాలుగేళ్లు, కే జి ఎఫ్ అరేళ్లు.. ఇక ఆ రికార్డులే మిగిలున్నాయి?

ప్రస్తుతం భారత సినీ అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా వేయికళ్ళతో ఎదురు చూస్తున్న పెద్ద సినిమాలలో తమిళ హీరో యష్ నటించిన కే జి ఎఫ్ 2 సినిమా కూడా ఒకటి.భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.

 Records Of Tollywood Industry , Kgf , Tollywood Industry , Records , Indian Cin-TeluguStop.com

ఈ సినిమా అన్ని ఇండస్ట్రీల్లో సృష్టించిన సెన్సేషన్ ఇప్పటికీ సినీ అభిమానులు అందరూ కూడా మరిచిపోలేదు అని చెప్పాలి.ఇక ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది అని తెలియడంతో అభిమానులు అందరూ ఆనందోత్సాహాల్లో మునిగి పోయారు.

అంతేకాదు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అయితే ఇప్పటికే కే జి ఎఫ్ 2 సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు వచ్చి విడుదల కావాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్ కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవడం తో ఈ సినిమాకు సంబంధించిన విడుదల వాయిదా పడుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే.ఇక మొత్తంగా చూసుకుంటే కేజిఎఫ్ రెండు పార్ట్ ల కోసం అటు హీరో యష్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దాదాపు ఆరు సంవత్సరాలు కష్ట పడ్డారు అని చెప్పాలి.ఇక అచ్చంగా ఇలాగే తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా రెండు పార్ట్ ల కోసం కూడా జక్కన్న ఇదే రేంజిలో కష్టపడ్డాడు.

దాదాపు నాలుగు సంవత్సరాల పాటు కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించాడు.

బాహుబలి తెరకెక్కించిన సమయంలో కరోనా వైరస్ ఇబ్బందులు లేవు.కానీ కేజిఎఫ్ సమయంలో మాత్రం కరోనా వైరస్ ఊహించని రేంజ్ లో ఇబ్బందులు సృష్టించింది.దీంతో అటు బాహుబలి తో పోల్చి చూస్తే ఆరేళ్ల పాటు రెండు పార్ట్ లు తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ కోసం కాస్త ఎక్కువగానే కష్టపడ్డాడు అన్నది తెలుస్తోంది.

ఇటీవలే కే జి ఎఫ్ 2 షూటింగ్ పూర్తి చేసుకొని అన్ని పనులకు కూడా పుల్స్టాప్ పెట్టేసారు.ఇప్పుడు ప్రమోషన్స్ ఒక్కటే మిగిలి ఉంది.ఏప్రిల్ 14వ తేదీన కే జి ఎఫ్ 2 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.ఒకప్పుడు బాహుబలి లాగానే ఇక ఇప్పుడు కే జి ఎఫ్ 2 సినిమా కూడా రికార్డులు తిరగరాయడం ఖాయం అని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube