రికార్డ్: అతి పిన్నవయసులో 150 దేశాల వివరాలు చెబుతోన్న చిన్నారి..!

ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక రకమైన ట్యాలెంట్ ఉంటుంది.అది నిరూపించుకోవడానికి ఒక సమయం అంటూ వస్తుంది.

 Record The Youngest Child To Tell The Details Of 150 Countries, World Record, Wo-TeluguStop.com

వారి ట్యాలెంట్ ను నిరూపించుకోవడానికి అనేక కష్టాలు పడుతూ, సమస్యలు ఎదుర్కొంటున్న వారిని ఎన్నో చూసాము.ట్యాలెంట్ ఉంటే సాధ్యం కానీ పనినైనా సుసాధ్యం చేయగల సామర్థ్యం చేసే వారు ఎందరో ఉన్నారు.

ఇలాంటి ఒక చిన్నారి అతి చిన్న వయసులోనే వరల్డ్ రికార్డ్స్ ఇండియా బుక్ లో చోటును సొంతం చేసుకుంది.కరోనా వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్ ను ఈ అమ్మాయి 100% సద్వినియోగం చేసుకొని తన ఇష్టానికి పదునుపెట్టి 5 సంవత్సరాల ప్రెషా ఖెమాని కేవలం 4 నిమిషాల 17 సెకండ్ల వ్యవధిలోనే 150 దేశాల పేర్లు, ఆ దేశాల రాజధానులను చెబుతోంది.

అలాగే దేశాల జెండాలను కూడా చాలా సులువుగా గుర్తుపట్టేస్తుంది.దీంతో ఈ చిన్నారి వరల్డ్ రికార్డ్స్ ఇండియా బుక్స్ లో స్థానాన్ని సొంతం చేసుకుంది.

అలాగే ఈ రికార్డ్స్ లో స్థానం సొంతం చేసుకున్న అతి చిన్న వయసు ఈ బాలిక అవ్వడం విశేషం.

ఈ సందర్భంగా ఆ చిన్నారి తల్లి మాట్లాడుతూ.

గత సంవత్సరం విధించిన లాక్ డౌన్ సమయంలో ఒక జాగ్రఫీ బుక్ ను ప్రెషా ఖెమాని కు గిఫ్ట్ గా ఇచ్చారు.ఆ చిన్నారి ఆ బుక్ పై శ్రద్ధ పెట్టి ప్రపంచ రికార్డు సొంతం చేసుకుందని తెలియజేశారు.

అంతేకాకుండా మా స్నేహితులు తన కూతురికి ఇచ్చిన జాగ్రఫీ బుక్కులో వివిధ దేశాలకు చెందిన జెండాలు ఉన్నాయి అవి కూడా తనను బాగా ఆకర్షించాయి.దీంతో ఆ పుస్తకంపై చాలా ఇంట్రెస్ట్ చూపించడంతో.

తాను కూడా వాటినన్నిటినీ మా పాపకు వినిపించానని ప్రెషా ఖెమాని తల్లి తెలిపింది.

ఇక వీరు రాజస్థాన్ లోని ఉజ్జయినికి చెందినవారు.

బాలిక తండ్రి పుణేలో చార్టెడ్ అకౌంట్ గా విధులు నిర్వహిస్తున్నారు.బాలిక తండ్రి మాట్లాడుతూ.

ఏడు నెలల లాక్ డౌన్ సమయంలో లో ఒక క్రమ పద్ధతి ప్రకారం 150 దేశాలు, వాటి రాజధానులు, జెండాలను పూర్తిగా నేర్చుకుందని.ప్రస్తుతం పాప వివిధ దేశాల కరెన్సీలు, భాషలు, దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రుల పేర్లు నేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందని తండ్రి తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube