రికార్డ్: ఆ ఆవు ధర ఏకంగా..?!

సాధారణంగా ఆవులను ఎవరైనా సరే 10 వేలు లేదా 20 వేలు పెట్టి కొంటు ఉండడం సహజం.అలాగే కొన్ని రకములైన ఆవులను అంతకంటే ఎక్కువ రేటు పెట్టి కొనడం, అలాగే ఆ తర్వాత దాన్ని ఎక్కువ రేటు అమ్మడం మనం చూసే ఉంటాం.కానీ, తాజాగా ఇంగ్లాండ్ కు చెందిన ఒక ఆవు ఏకంగా 2.61 కోట్లకు అమ్ముడు అయిందంటే నమ్మండి.నిజానికి ఆ ఆవుకు వయసు నిండా 14 నెలలు మాత్రమే.కానీ, ప్రపంచంలోనే అత్యుత్తమ జాతి ఆవులలో ఇది కూడా ఒకటి.ఆ ఆవు పేరు పోష్ స్పైస్ (Posh Spice). ఈ ఆవు ఇంగ్లాండ్ లో ష్రాప్‌ షైర్‌ లో పెరిగింది.ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో ఈ ఆవు అమ్ముడైంది.గతంలో కూడా ఈ జాతికి చెందిన ఆవును వేలం వేయగా అప్పటిలో 1.31 కోట్లు పలికింది.ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన ఆవు అదే ఉండగా తాజాగా ఆ రికార్డును బద్దలు కొడుతూ పోష్ స్పైస్ రికార్డ్ స్థాయిలో నిలిచింది.

 World Record, Cow,crores, Posh Spice, England, Viral Latest,greater Manchester ,-TeluguStop.com

వాస్తవానికి పొడిగ్రీ జాతికి చెందిన ఈ పోష్ స్పైస్ కి ఆ పేరు పెట్టడానికి గల ఒక కారణం కూడా ఉంది.ఆ కారణం ఏమిటంటే 1990 నాటి ప్రపంచ ఫేమస్ పాప్ బ్యాండ్ స్పైస్ గర్ల్స్ ని పోష్ స్పైస్ అని కూడా పిలుస్తూ ఉంటారు.

 నిజానికి ఆ బ్యాండ్ అంటే ఈ ఆవు ఓనర్లకు బాగా ఇష్టం.అందుకే దీనికి ఆ పేరు పెట్టారు అని అందరు అంటూ ఉంటారు.

ఈ ఆవులు కాస్త రఫ్ గా ఉంటాయి.ఇలాంటి జాతికి చెందిన ఆవులు 1989 నుంచి డాన్, క్రిస్టీన్ విలియమ్స్ పెంచుకుంటూ ఉన్నారు.

ఆ ఆవుకు పుట్టిన నాలుగు దూడలను వారు చాలా సున్నితంగా కాపాడుకుంటూ, తల్లి చనిపోయిన అనంతరం కూడా పిల్ల ఆవులను జాగ్రత్తగా కాపాడటం వాటిని పెంచుతున్నారు.ఒక్కసారిగా ఈ ఆవు ఇంత ఎక్కువ ధర పలకడంతో క్రిస్టిన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.ఈ ఆవు ఇంత ధర పలుకుతుందని మేము అసలు ఊహించలేదు.

మేము చాలా ఆనందపడుతున్నామని.మాకు మంచి ఫలితం దక్కింది అంటూ పేర్కొంది.

ఇక ఈ ఆవు చూడడానికి చాలా అందంగా ఉండడంతో పాటు ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా ఉంది.అంతేకాకుండా ఈ జాతికి చెందిన ఆవులను పెంచే కాంబ్రియాలోని జెన్కిన్సన్, గ్రేటర్ మాంచెస్టర్ లోని డేవిస్, బిడెన్ వారికీ  పోష్ స్పైస్ ఆవులు కావాలని అడగడంతో వాటికీ డిమాండ్ బాగా పెరిగిపోయింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube