అమెరికాలో రికార్డ్ స్థాయిలో పోలింగ్...సర్వేలు ఏం చెప్తున్నాయంటే..!!!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇరు అభ్యర్ధుల తలరాతలను డిసైడ్ చేసే దిశగా అమెరికన్స్ ఓట్లను వినియోగించుకుంటున్నారు.ఈ దఫా జరుగుతున్న ఎన్నికలను ప్రజలు సైతం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని పలు సర్వేలు సైతం చెప్తున్నాయి.

 Record Level Of Polling In America  What The Surveys Say  America President Elec-TeluguStop.com

ఈ ఎన్నికల్లో ప్రజలు ఎంతో చురుకుగా పాల్గొంటున్నారని ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నారని ఇప్పటి వరకూ దాదాపు 6 కోట్ల మంది ప్రజలు ఎర్లీ ఓటింగ్ ద్వారా తమ ఓట్లను వేశారని సిఎన్ఎన్ నివేదించింది.ఇదిలాఉంటే

2016 ఎన్నికలతో పోల్చితే ఈ ఓటింగ్ సరళి చాలా ఎక్కువగా ఉందని, ఒక వేళ ఎర్లీ ఓటింగ్ బ్యాలెట్ లు ఎక్కువగా ఉంటే ఓటింగ్ రిజల్స్ ప్రక్రియకు సమయం పడుతుందని కూడా తెలిపింది.

కరోనా కారణంగా ఎక్కువ మంది ఓటింగ్ కేంద్రాలకు వెళ్ళకుండా ఉండేందుకు మొగ్గు చూపుతున్నారని అయినా సరే ఇప్పటి వరకూ పోల్ అయిన ఓట్లు ఎక్కువగానే ఉన్నాయని నివేదిక తెలిపింది.ఈ దఫా అమెరికా వ్యాప్తంగా 24 కోట్ల మంది అమెరికన్స్ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని ప్రకటించింది.

Telugu America, Democartic, Donald Trump, Joe Biden, Levelamerica, Republican-Po

అమెరికా టుడే నివేదిక ప్రకారం ఈ సారి రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరుగుతోందని, భవిష్యత్తులో కూడా ఈ పోలింగ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.ఇప్పటి వరకూ వేసిన ఓట్లలో అత్యధికంగా డెమొక్రాట్ల ఓట్లు అత్యధికంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేసింది.అయితే ఈ సారి ఎన్నికలు 3 వ తేదీన అయిన వెంటనే ఫలితాలు వచ్చే అవకాశం లేదని సదరు సర్వే తెలిపింది.2016 లోనే ఫలితాల విషయంలో ఆలస్యం జరిగిందని, ఇప్పుడు మరింత ఆలస్యం జరగనుందని ప్రస్తుతం పోలయిన ఓట్లు అన్నీ ట్రంప్ కి పట్టుగా భావిస్తున్న కీలక రాష్రాల నుంచీ వచ్చాయని వీరిలో ముఖ్యంగా యువత ఓటింగ్ ఎక్కువగా ఉందని ముఖ్యంగా టెక్సాస్ రాష్ట్రంలో భారీగా పోలింగ్ నమోదు అయ్యిందని 70 లక్షల మంది అమెరికన్స్ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube