దేశంలో తొలిసారిగా టీకా డ్రైవ్‌లో రికార్డ్.. !

దేశంలో మొదటిసారిగా కరోనా వ్యాక్సినేషన్ పక్రియ ప్రారంభించినప్పుడు చాల మంది ఈ టీకా ఇప్పించుకోవడానికి సందేహించారు.కొన్ని అపశృతులు కూడా దొర్లాయి.

 Record For First Vaccination Drive In The Country-TeluguStop.com

కానీ ప్రస్తుతం ప్రజలందరు కోవిడ్ వ్యాక్సిన్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.ఇప్పటికే దేశంలోని ప్రముఖులంతా కరోనా టీకా తీసుకున్న విషయం తెలిసిందే.

ఇక మార్చి 1వ తారీఖు నుండి ఈ వ్యాక్సినేషన్ పక్రియలో వేగం పెరిగింది.

 Record For First Vaccination Drive In The Country-దేశంలో తొలిసారిగా టీకా డ్రైవ్‌లో రికార్డ్.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకంటే 60 సంవత్సరాలు దాటిన వారికి కూడా టీకాలు వేస్తుండటంతో చాల మంది దీనికోసం క్యూ కడుతున్నారు.ఇకపోతే దేశంలో తొలిసారిగా టీకా డ్రైవ్‌లో ఒకే రోజు 1.3 మిలియన్లకు పైగా ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ వేసినట్లు తాజాగా కేంద్రం తెలిపింది.ఈమేరకు గత 24 గంటల్లో 13,88,170 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది.ఇక దేశంలో జనవరి 16న టీకాల పంపిణీ మొదలైన విషయం తెలిసిందే.కాగా ఇప్పటి వరకు 60 ఏళ్లు పైబడిన 14.95 లక్షలు, 45 ఏళ్లు పైబడిన 2.18 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసినట్టు అధికారులు వెల్లడించారు.

#Coronavirus #Record #COVID-19 #First #Country

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు