రికార్డ్ క్రియేట్ చేసిన టీమిండియా ఓపెనర్స్..!

కరోనా అందర్నీ కట్టడి చేసినా కూడా క్రికెట్ ను మాత్రం టచ్ చేయడం లేదు.అందుకే సజావుగా మ్యాచ్ లు జరుగుతున్నాయి.

 Record-breaking Team India Openers  Sports,team India, England, Rohit, Kl Rahul,-TeluguStop.com

తాజాగా ఇప్పుడు టీమిండియా ఇంగ్లండ్ తో టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది.రెండో టెస్టులో ఇండియా టీమ్ ఓపెనర్లు అయిన రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ లు సూపర్ రికార్డ్ ను క్రియేట్ చేశారు.

ఇంగ్లండ్ తో టీమిండియా లార్డ్స్‌ వేదికగా తలపడుతోంది.రెండో టెస్టు జరుగుతున్నప్పుడు రోహిత్, రాహుల్ లు ఇద్దరూ 126 రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో రికార్డ్ క్రియేట్ చేశారు.69 సంవత్సరాల తర్వాత లార్డ్స్‌ గ్రౌండ్ లో టెస్టు మ్యాచ్‌ లో 100 రన్స్ కు పైగా భాగస్వామ్యాన్ని ఇండియా జట్టులోని ఆ జోడీ రికార్డు క్రియేట్ చేసింది.గ్రౌండ్ లో పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంది.అయినప్పటికీ రోహిత్‌, రాహుల్‌ లు అద్భుతంగా రాణించారు.126 రన్స్ సాధించారు.,/br>

1952వ సంవత్సరంలో క్రికెట్ ఎంటర్ అయిన లార్డ్స్‌ లో అదే రికార్డ్ ఒకటి ఉండేది.అప్పుడు భారత్‌ జట్టులోని సభ్యులు అయిన వినోద్‌ మన్కడ్‌, పంకజ్‌ రాయ్‌ లు పరుగుల వర్షం కురిపించారు.

వందకు పైగా రన్స్ చేసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని క్రియేట్ చేశారు.ఆ సమయంలో వాళ్లు వినోద్‌, పంకజ్‌ 106 రన్స్ చేసి భాగస్వామ్యాన్ని లిఖించారు.

Telugu Break, England, India, Kl Rahul, Rohit-Latest News - Telugu

ప్రస్తుతం అంటే 69 సంవత్సరాల తర్వాత వారి రికార్డును ఇప్పుడున్న టీమిండియా జట్టు జోడి తిరగరాసింది.రెండో టెస్ట్ లో రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌ ల జోడీ ఆ రికార్డును తిరగరాసింది.మొదటి వికెట్‌ కు వారిద్దరూ అద్బుతమైన భాగస్వామ్యాన్ని ఇచ్చారు.2008వ సంవత్సరంలో ఇంగ్లండ్ ఓపెనర్లు అయిన అలిస్టర్ కుక్, ఆండ్రూ స్ట్రాస్ లు ఇద్దరూ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో 114 రన్స్ భాగస్వామ్యం చేశారు.ఆ తర్వాత 13 ఏళ్ల పాటు ఇంకో జోడి ఆ రికార్డును టచ్ చేయలేదు.ఇప్పుడు భారత జట్టులోని జోడి ఏకంగా 126 రన్స్ తో భాగస్వామ్యాన్ని క్రియేట్ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube