ఆ దేశంలో డెలవరీల కంటే అబార్షన్‌లు ఎక్కువ... అంత నీచమైన దేశం ఏది, ఎందుకో తెలుసా?  

Record Abortions In Greenland Country Around World-

మన దేశంలో అబార్షన్‌లపై పెద్ద యుద్దమే జరుగుతోంది.అవాంచిత గర్భం మరియు కొడుకు కావాలనుకోవడం వంటి కారణాల వల్ల అబార్షన్‌లు చేయించుకుంటున్న విషయం తెల్సిందే.అయితే ఇండియాలో అబార్షన్‌ చేయించుకున్నా, చేసినా కూడా కఠిన శిక్షలు ఉన్నాయి...

Record Abortions In Greenland Country Around World--Record Abortions In Greenland Country Around World-

అయినా కూడా కొన్ని చోట్ల ఇంకా జరుగుతునే ఉన్నాయి.ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రపంచంలోనే అత్యంత దారుణమైన దేశంగా గ్రీన్‌ లాండ్‌ నిలిచింది.ఆ దేశంలో డెలవరీల సంఖ్య కంటే కూడా అధికంగా అబార్షన్‌లు ఉంటున్నాయి.

అబార్షన్‌లు అక్కడ చట్టబద్దం, అసలు అబార్షన్‌ అనే విషయం వారికి చాలా చాలా కామన్‌.అబార్షన్‌ చేయించుకున్నామనే ఫీలింగ్‌ అక్కడ ఉండదు.

Record Abortions In Greenland Country Around World--Record Abortions In Greenland Country Around World-

ప్రపంచంలోనే అతి పెద్ద దీవి దేశంగా గ్రీన్‌ లాండ్‌ నిలిచింది.

అక్కడ జనాబా 60 వేల లోపే ఉంటుంది.అక్కడ కొన్ని పద్దతులు ప్రపంచంలోనే అత్యంత దారుణంగా ఉంది.ముఖ్యంగా అబార్షన్‌ విషయంలో అక్కడ ఉన్న విధానం ప్రపంచంలో మరెక్కడ లేదు అనడంలో అతిశయోక్తి కాదు.అక్కడ 14 లేదా 15 ఏళ్ల వయసు నుండే యువతి యువకులు శృంగారంకు సిద్దం అవుతారు.స్కూల్‌ ఏజ్‌లోనే కలవడం జరుగుతుంది.

అక్కడ పెళ్లికి ముందు శృంగారం ఎలాంటి తప్పు లేదు.15 ఏళ్ల వయసులోనే శృంగారంలో పాల్గొనడం వల్ల ఆ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు పాటించని కారణంగా గర్బం దాల్చడం జరుగుతుంది.ఇక కొందరు గర్బనిరోదక మాత్రలు ఉంటాయని తెలిసి కూడా వాటిని వాడకుండా ఉంటారు.

తాగిన మైకంలో లేదంటే మరే పరిస్థితుల్లో అయిన గర్బనిరోదక మాత్రలు తీసుకోకుండా శృంగారంలో పాల్గొనడం వల్ల గర్బం వస్తుంది.

అక్కడ గర్బస్రావం ఉచితంగా చేస్తారు.ఎవరు వెళ్లినా, ఏ వయసు వారు వెళ్లినా, ఒంటరిగా వెళ్లినా కూడా వెంటనే అబార్షన్‌ చేసేస్తారు.అక్కడ అబార్షన్‌ చేయించుకున్నారు అనే విషయం అసలు పరిగణలోకి తీసుకోరు.

చాలా లైట్‌గా ఉంటారు.ఒక ప్రముఖ మీడియా సంస్థతో స్థానిక యువతి మాట్లాడుతూ నేను ఇప్పటి వరకు మూడు సార్లు అబార్షన్‌ చేయించుకున్నాను.మళ్లీ చేయించుకుంటానేమో నాకు తెలియదు అంది.

ఆమె వయసు ఎంతో తెలుసా కేవలం 17 సంవత్సరాలు.మరో యువతి గత రెండు సంవత్సరాల్లో ఆరు సార్లు గర్బ స్రావం చేయించుకున్నట్లుగా నిర్మొహమాటంగా చెప్పుకొచ్చింది.తనకు గర్బ నిరోదక మాత్రల గురించి తెలుసు కాని, ఆ సమయంలో వాటి గురించి మర్చి పోతున్నాం అంటూ చెప్పుకొచ్చింది.

గర్బస్రావం చేసేందుకు హాస్పిటల్స్‌ ఉచిత సర్వీస్‌లు ఇస్తున్నాయి.

కనీస మొత్తం అయినా తీసుకుంటే ఆర్థిక పరిస్థితుల కారణంగా అబార్షన్‌లు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.కాని అక్కడ ప్రభుత్వం మాత్రం అబార్షన్‌లు ఉచితంగా చేయాల్సిందే అంటూ హాస్పిటల్స్‌ను ఆదేశించాయి.గత పదేళ్లుగా లెక్కలు తీసుకుంటే ప్రతి సంవత్సరంలో కూడా 700 జననాలు ఉంటే, 800లకు పైగా అబార్షన్‌లు జరుగుతున్నాయి.ఇది అధికారిక లెక్క మాత్రమే.

అనధికారికంగా 700 జననాలు ఉంటే 1000కి పై అబార్షన్‌లు ఉంటాయని స్థానికులు నిసిగ్గుగా చెబుతున్నారు.