ఆ అమెరికా దంపతుల కన్నీటి వ్యధ...ప్రపంచాన్ని కదిలిస్తోంది

పిల్లల కోసం ఎంతో మంది తల్లితండ్రులు ఎంతగానో పరితపిస్తూ ఉంటారు.పుట్టబోయే పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకోవాలి, ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని అనుక్షణం ఆలోచిస్తారు.

 Recessive Dystrophic Epidermolysis Bullosa-TeluguStop.com

వారు అనుభవించిన బాధలు, కష్టాలు పిల్లల దరిదాపులకు కూడా రాకుండా చూసుకోవాలని, చక్కటి భవిషత్తు వారికి ఇవ్వాలని కలలు కంటుంటారు.ఇంతగా ఎదురు చూసే తల్లితండ్రులకు ఒక బిడ్డ పుట్టి, ఆ బిడ్డ పుట్టకతోనే తీవ్రమైన సమస్యతో బాధ పడుతుంటే ఆ తల్లి తండ్రుల పరిస్థితి దారుణం.

పిల్లలు పుట్టారని సంతోషపడాలో లేదా పుట్టుకతోనే సమస్యతో ఇబ్బందులు పడుతున్న ఆ పసికందు చూసి బాధపడాలో అర్ధంకాదు.ఇలాంటి పరిస్థితే అమెరికాలోని ఓ తల్లితండ్రులకు ఎదురైంది….

వివరాల్లోకి వెళితే.

అమెరికాలోని కాలిఫోర్నియాలోని విక్టర్ నవా, అడ్రియానా, దంపతులకు కొంత కాలం క్రితమే ఓ మగ బిడ్డ జన్మించాడు.

ఆ పసికందును ముట్టుకోవాలి, ఎత్తుకొని ఆడించాలని తల్లితండ్రులు ఎంతో ఆశ పడ్డారు.కాని, వారికి అంత అదృష్టం లేదు.ఆ పసికందును ఎవరైనా తాకితే, తాగిన చోట చర్మం ఊడిపోతోంది.మాములుగా శరీరం కాలినప్పుడు మాత్రమే ఈ విధంగా చర్మం ఊడడం జరుగుతుంది.

కాని, ఇక్కడ మాత్రం ఈ పసివాడికి ఎటువంటి గాయం లేకుండానే చర్మం ఊడడం వైద్యులను సైతం ఆశ్చర్య పరుస్తోంది.అయితే .

Telugu Adriana, Telugu Nri Ups, Nova-

ఈ వ్యాధిని రిసెసివ్ డిస్ట్రోఫిక్ ఎపిడేర్మోలిసిస్ బులోసా అంటారని.ఈ సమస్య పుట్టుకతోనే వచ్చి, జీవితాంతం వెంటాడుతుందని, దీని వలన భవిషత్తులో మరిన్ని చర్మ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు.ఇలాంటి పరిస్థితుల్లో ఈ పసికందు బతికే అవకాశం కేవలం 87 శాతం మాత్రమే ఉందని వైద్యులు తెలిపారు.ఇదిలాఉంటే, రోజు చర్మ సమస్యతో బాధపడుతున్న ఆ పసివాడిని చూసుకొని తల్లితండ్రులు రోజురోజుకి కుంగిపోతున్నారు.

ఈ చిన్నారికి వచ్చిన సమస్యకై తల్లితండ్రులు ‘గోఫండ్ మి’ ద్వారా ఆర్ధిక సాయం కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube