అక్కడ ఓటు వేయకుంటే 9000 రూపాయల వరకు ఫైన్ కట్టాల్సిందే.. పోలింగ్ గురించి మీకు తెలియని కొన్ని విచిత్ర విషయాలు  

Received A Fine For Not Voting-

మన దేశం లో పోలింగ్ రోజు తమ ఓటు హక్కు ఎలాగైనా వినియోగించుకోవాలని ఎంత దూర ప్రాంతాలలో ఉన్న పోలింగ్ బూత్ కి వెళ్లి ఓటు వేస్తారు , మరికొందరి పోలింగ్ బూత్ సమీపం లో ఉన్న ఓటు ని వినియోగించుకోరు. అయితే కొన్ని దేశాలలో ఓటు వేయకుంటే ప్రభుత్వానికి ఫైన్ కట్టాల్సిందే. ఇలా ఒక్కో దేశం లో ఒక్కో తరహా పోలింగ్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు..

అక్కడ ఓటు వేయకుంటే 9000 రూపాయల వరకు ఫైన్ కట్టాల్సిందే.. పోలింగ్ గురించి మీకు తెలియని కొన్ని విచిత్ర విషయాలు-Received A Fine For Not Voting

1.ఆ దేశాలలో ఓటు నమోదు చేసుకోవడం అవసరం లేదు

స్వీడన్, ఫ్రాన్స్ దేశాలలో ఓటర్లు ప్రత్యేకంగా వెళ్లి నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళను గుర్తించి ఓటర్లుగా రిజిస్టర్ చేస్తుంది.

2.ఎక్కువ దేశాల్లో పోలింగ్ ఆదివారం రోజున ఉంటాయి

అమెరికాలో ఎలక్షన్లు మంగళవారాలు జరుగుతాయి. కానీ చాలా దేశాలు తమ ఎలెక్షన్లను ఆదివారాలు జరిగేలా చూసుకుంటాయి. అయితే ఆంగ్ల భాష ప్రాధమిక భాషగా ఉన్న దేశాలకు ఈ రోజు మినహాయింపుగా వుంది.

కెనడాలో సోమవారం, బ్రిటిష్ వాళ్లు గురువారం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో శనివారాలు ఎలెక్షన్లు జరుగుతాయి.

3.ఎస్టోనియా దేశంలో ఆన్ లైన్ లో కూడా ఓటు వేయచ్చు

2005వ సంవత్సరం నుంచి ఎస్టోనియా అనే దేశంలో అక్కడి ఓటర్లకి ఇబ్బంది కలగకుండా ఆన్ లైన్ లొనే ఓటు వేసే సదుపాయం కలిపించారు

4.ఆస్ట్రేలియా లో ఓటు వేయడం తప్పనిసరి

ఆస్ట్రేలియా లో 18 ఏళ్ళు నిండి న ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలి. అలాగే తమ ఓటు ని నమోదు చేయని పరిస్థితిలో 20 ఆస్ట్రేలియా డాలర్ లు జరిమానా గా కట్టాల్సిందే. కొన్ని సార్లు ఓటు వేయకుంటే ఆ జరిమానా కాస్త 150 నుండి 200 ఆస్ట్రేలియా డాలర్ల వరకు ఉండచ్చు అంటే మన దేశ కరెన్సీ లో దాదాపు 9000 రూపాయలు అన్నమాట.

5.ఈ దేశాలలో 18 ఏళ్ళు నిండాకున్న ఓటు వేయవచ్చు

ఆస్ట్రియా, అర్జంటినా దేశాల్లో 17 సంవత్సరాల వయసువాళ్ళు జర్మనిలో 16 ఏళ్ల వాళ్లు ఓటు వేయడానికి అర్హులైతే 2014లో మొదటిసారి స్కాటిష్ ప్రజలు 16, 17 సంవత్సరాల వాళ్లు ఓటు వేయడానికి అర్హులు..

6.చీలి దేశం లో ఆడ వారికి మగవారికి వేరు వేరుగా ఓటింగ్

చీలి దేశం లో స్త్రీ లకు 1930 సంవత్సరం లో తొలిసారి వారికి ఓటు హక్కుని కల్పించారు. అప్పటి నుండి ఆడవారికి మగవారికి వేరు వేరుగా ఓటింగ్ నిర్వహిస్తున్నారు.

7.ప్రపంచం లో అత్యధిక ఓటింగ్ శాతం కలిగిన దేశం

చాలా దేశాల్లో ఓటింగ్ శాతం 70 కి మించి ఉండదు కొన్ని దేశాల్లో 50 శాతం ఉండడం గగనమే , అయితే బెల్జియం దేశం లో మాత్రం అత్యధికంగా 87.2 శాతం ఓటింగ్ జరుగుతుంది. ఇది ప్రపంచం లొనే అత్యధికం.

8.ఒక్క ఓటర్ కోసం ప్రత్యక పోలింగ్ బూత్

మన దేశం లో గీర్ అనే అటవీ ప్రదేశం లో భారత్ దాస్ దర్సన్ దాస్ అనే ఓటరు కోసం ఏకంగా ప్రత్యకమైన పోలింగ్ బూత్ ఏ ఏర్పాటు చేస్తారు.