సలార్ మళ్ళీ వాయిదా.. కారణం ఏమిటంటే?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి చిత్రం “సలార్“.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

 Prabhas, Salaar, Tollywood, Release Date,latest Tollywood News-TeluguStop.com

ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండవ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మొదట్లో ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు.

అయితే ఈ సినిమా విడుదల తేదీ వాయిదా వేస్తూ ఈ చిత్రం 2023లో విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

తాజాగా వీటిపై స్పందించిన చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించింది.2022 ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించినప్పటికీ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా హోంబలే ప్రొడక్షన్స్ లో కేజిఎఫ్ చాప్టర్ 2 జరిగిన సంగతి మనకు తెలిసిందే.కరోనా కారణం చేత వాయిదా పడిన ఈ సినిమాను ఏప్రిల్ 14 2022 వ తేదీన విడుదల చేయడంతో ప్రభాస్ సలార్ విడుదల తేదీ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

Telugu Salaar, Jagapathi Babu, Prabhas, Prasanth Neel, Sruthi Haasan, Tollywood-

ఈ క్రమంలోనే ప్రభాస్ “సలార్” సినిమాను వచ్చే ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం భావించినట్లు తెలుస్తోంది.ప్రభాస్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.డాన్ పాత్రతో పాటు, ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తున్నారు.ఈ సినిమాలో జగతిబాబు రాజ్ మన్నార్ పాత్రలో నటిస్తున్నట్లు గత కొద్ది రోజుల క్రితం చిత్రబృందం అధికారికంగా వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube