సోషల్ మీడియాలో ప్రతినిత్యం అనుష్క ప్రభాస్ ( Prabhas ) పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇప్పటికీ ఎన్ని వార్తలు వచ్చాయో వేళ్ళపై లెక్కపెట్టడం కష్టం.వీరిపై వందల కొద్ది వేలకొద్దీ పెళ్లి వార్తలు వచ్చాయి ఇప్పటికి వినిపిస్తూనే ఉన్నాయి.
అయితే తాజాగా అనుష్క ( Anushka ) ప్రభాస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక షాక్ లాంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అదే ప్రభాస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారట.కానీ ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది అనుష్కని మాత్రం కాదు.ప్రభాస్ తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారట.
ఇక ఈ సంబంధం కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ( Shyamala Devi ) చూసిందట.ఇక ఆ అమ్మాయిని డైరెక్ట్ గా చూడకపోయినప్పటికీ శ్యామలాదేవి ఆ అమ్మాయి ఫోటో చూసి ఓకే చేసిందట.
అలాగే ఆ అమ్మాయి ప్రస్తుతం అమెరికాలో బిజినెస్ కి సంబంధించిన స్టడీ చేస్తుందని,త్వరలోనే ఇండియాకి వస్తుందని ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది.
అలాగే ఇదే విషయాన్ని ప్రభాస్ కి చెబితే ఆయన కూడా పాజిటివ్ గా స్పందించినట్టు ఫిలింనగర్లో ఒక టాక్ వినిపిస్తోంది.అయితే త్వరలోనే ఆ అమ్మాయి ఇండియాకి వచ్చాక ప్రభాస్ కి ఆ అమ్మాయి తో పెళ్లి చూపులు అరేంజ్ చేసి ఇద్దరికీ ఇష్టం కలిగితే త్వరలోనే పెళ్లి చేయాలని కృష్ణంరాజు ( Krishnam Raju ) భార్య చూస్తుందట.ఇక ఈ విషయంలో ప్రభాస్ ( Prabhas Marriage ) కూడా పాజిటివ్ గానే స్పందించడంతో త్వరలోనే ప్రభాస్ పెళ్లి జరగబోతుందని తెలుస్తోంది.
కానీ ప్రభాస్ అనుష్క అభిమానులు మాత్రం ఈ విషయంలో నిరాశ పడుతున్నారు.