జగన్ రియల్ హీరో అంటున్న రెబల్ స్టార్  

జగన్ రియల్ హీరో అంటున్న కృష్ణంరాజు. .

Rebel Star Krishnam Raju Interesting Comments On Y S Jagan-

టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నాడు.గతంలో బిజెపి పార్టీ తో పాటు అనంతరం ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన కృష్ణంరాజు చాలా కాలంగా రాజకీయాలను నుంచి దూరంగా ఉన్నాడు.ఆ మధ్య కాలంలో కృష్ణంరాజు వైసీపీలో చేరతానని టాక్ వినిపించినా కూడా మరే కారణాల వలనో అతను ఆ పార్టీలో చేరలేదు..

Rebel Star Krishnam Raju Interesting Comments On Y S Jagan--Rebel Star Krishnam Raju Interesting Comments On Y S Jagan-

ఇదిలా ఉంటే మరల కృష్ణంరాజు రాజకీయాల్లో బిజీగా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నాడనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.దీనికి నిదర్శనంగా తాజాగా కృష్ణంరాజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులందరికీ కృష్ణంరాజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు మంత్రివర్గ విస్తరణలో జగన్ సామర్థ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మంత్రిమండలిలో ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు సమాన ప్రాధాన్యత కల్పించడం లో జగన్ తన నాయకత్వ లక్షణాలను చూపించున్నాడు అంటూ కృష్ణంరాజు ప్రశంసించారు.జగన్ నాయకుల అత్యంత పరిణితితో వ్యవహరిస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు.రాష్ట్ర అభివృద్ధి లో జగన్ పరిపాలన ఖచ్చితంగా సువర్ణాక్షరాలతో లిఖించే చరిత్ర గా మారుతుందని కృష్ణంరాజు ప్రశంసలు కురిపించారు.

అయితే రెబల్ స్టార్ ఈ స్థాయిలో జగన్ పై ప్రశంసలు కురిపించడం వెనక రాజకీయ కారణాలు టాక్ ఇప్పుడు వినిపిస్తున్నాయి.మరి దీనిలో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.