మొటిమలు గిల్లకూడదు అని ఎందుకంటారంటే?

యుక్త వయసు రాగామే యువతీయువకులు ఎదుర్కొనే ప్రధాన సమస్య మొటిమలు.ఇవి జీన్స్ ద్వారా, ఆయిల్ స్కిన్ ద్వారా, స్ట్రెస్ ద్వారా వస్తాయి.

 Reasons Why You Should Pop Out A Pimple?-TeluguStop.com

సైన్స్ ప్రకారం లోతుగా చెబితే హార్మోన్ల సమతుల్యం లేకపోవడం వలన ఇవి ఏర్పడతాయి.ఈ మొటిమలు చూడ్డానికి ఒక్కోసారి పెద్దగా కూడా ఉంటాయి.

దీని వలన ముఖం తీరే మారిపోయి, మంటగా, చిరాగ్గా ఉంటుంది.

ఆ బాధ తట్టుకోలేకే మొటిమను గిల్లేస్తుంటారు.

అలా గిల్లకూడదు అని పెద్దవాళ్ళు, డాక్టర్లు చెప్పినా, చేతులు మొటిమల మీదికే వెళతాయి.అసలు ఈ మొటమలను గిల్లకూడదని ఎందుకు చెబుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయిల్, డెబ్రిస్, ఆక్నే బ్యాక్టీరియా .వీటి కలబోతే మొటిమ.మొటిమను గిల్లినప్పుడు దాంట్లో ఉన్న ఆ ఆక్నే బ్యాక్టిరియా, కేవలం మీ చర్మం బయటే కాదు, లోపల కూడా వేరే పోర్స్ లోకి చేరుతుంది.ముఖాన్ని బయట కడుక్కున్నంత మాత్రానా, లోపల జరిగే చర్యను ఆపలేం కదా.ఈ రకంగా ఒక్క మొటిమను గిల్లడం వలన మరో మొటిమ పుడుతుంది.అలా గిల్లిన కొద్ది ముఖమంతా మొటిమలు అవుతూనే ఉంటాయి.

దానికితోడు మచ్చలు, రంధ్రాలు అదనం.

గిల్లడం వలన గోళ్ళలో ఉండే బ్యాక్టీరియా కూడా మీ చేతులతో మీరే ముఖంలోకి ఇంజెక్ట్ చేసినట్లు అవుతుంది.

ఈకంగా రెండు రకాల ప్రమాదాలు ఉన్నాయి మొటమలను గిల్లడం వలన.మొటిమను అలానే వదిలేస్తే ఓ వారంలో వెళ్ళిపోతుంది.కాని గిల్లితే మాత్రం దాని తాలూకు మచ్చ లేదా రంధ్రం చాలాకాలం అలానే ఉండిపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube