అబ్బాయిలు అమ్మాయిలతో అబద్ధాలు ఎందుకు ఆడతారు ?

సిగ్గుపడటం అమ్మాయిలకి ఎంత కామన్ విషయమో, అబద్ధాలాడటం అబ్బాయిలకు అంత కామన్ విషయం.మరీ ముఖ్యంగా అమ్మాయి దగ్గర సాధ్యమైనంత వరకు అబద్ధాలే ఆడతారు అబ్బాయిలు.

 Reasons Why Men Lie To Women-TeluguStop.com

మరి అబ్బాయిలకి అబద్ధమాడాల్సిన అవసరం ఏంటి ?

* అమ్మాయిలను ఇంప్రెస్ చెయడానికి ఎక్కువగా అబద్ధాలాడతారు అబ్బాయిలు.అమ్మాయి డ్రెస్ నచ్చకపోయినా డ్రెస్ బాగుందని పొగడటం, కోటిలో వంద రూపాయలకి తీసుకున్న టీషర్ట్ ని, సెంట్రల్ మాల్ లో వెయ్యి రూపాయలకు కొన్నట్టు బిల్డప్ ఇవ్వడం లాంటి చిన్న అబద్ధాల నుంచి, జీతం ఎక్కువ చెప్పడం, తమకు సైట్ కొట్టే అమ్మాయిల లెక్క ఎక్కువ చెప్పడం వంటి పెద్ద అబద్ధాలు కూడా అవలీలగా అడేస్తారు.

ఇదంతా ఇంప్రెస్ చేయడానికే

* అమ్మాయిల కంట కన్నీరు చూడకూడదని కూడా అబద్ధాలు ఆడతారు అబ్బాయిలు.మనసు బాధపెట్టే నిజాలు దాచడం అబ్బాయిలకి బలపంతో నేర్చిన విద్య

* అమ్మాయి తనని విడిచి వెళ్ళిపోతుందేమో అనే భయంతో కూడా అబద్ధాలు ఆడతారు అబ్బాయిలు.

బేసిక్ గా అబ్బాయిలకు భయం ఎక్కువ.తమకంటే అందగాడో, ధనవంతుడో అమ్మాయికి తరసపడితే, మనసు ఎక్కడ మార్చుకుంటుందో అని భయపడతారు.అందుకే ఎప్పుడు తమవైపు దృష్టి ఉండేలా అబద్ధలాడతారు

* లవ్ మ్యాటర్ సెటిల్ అయిపోతే ఇంకోరకంగా అబద్ధాలాడతారు బాయ్స్.సాయంత్రం సినిమాకి తీసుకెళ్ళమని గర్ల్ ఫ్రెండ్ విసిగిస్తే, ఈరోజు ఆఫీసులో ఒవర్ టైమ్ డ్యూటి ఉందని ఏమాత్రం తడబాటు లేకుండా చెప్పేస్తారు.

నచ్చనిపని, లేదా చేసేంత ఓపిక లేని పని ఏది చెప్పినా, వెంటనే ఓ అబద్ధంతో తప్పించుకోవడం అబ్బాయిలకు మాత్రమే తెలిసిన విద్య

* ఇంతకుముందు చెప్పినట్టే అబ్బాయిలకు భయం ఎక్కువ.పొరపాటులో ఎక్కడైనా తప్పు జిరిగితే, గర్ల్ ఫ్రెండ్ ముందుకి నిజంతో రావడం అబ్బాయిల తరం కాదు.

అందుకే తప్పు కప్పిపుచ్చుకోవడానికి అబద్ధంతో ముందుకి వస్తారు

అంతమాత్రాన అబ్బాయిలు చెడ్డవారు అనుకోవడానికి వీల్లేదు.మోసం చేయనంత వరకు, అబ్బాయిల అబద్ధాలు క్యూట్ గా ఉంటాయి.

మరీ ముఖ్యంగా అమ్మాయి మీద ఇష్టంతో ఆడినవే అయ్యి ఉంటాయి.
.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube