మీకు గుర్తుందా చిన్నతనంలో మనం అందరం ఒక మగ్ తీసుకుని అందులో సర్ఫ్ గాని, సోప్ గాని వేసి నీళ్లు పోసి గిలకొట్టి ఆ నీటితో బుడగలు ఊదుకుని ఆడుకునే వాళ్ళము.ఇప్పుడు మన పిల్లలు కూడా స్నానం చేసేటప్పుడు సబ్బు రుద్దుకుని చేతితో బుడగలు చేసి వాటిని చూసి తెగ సంబరపడిపోతూ ఉంటారు.
అలాగే పిల్లల్ని సరదాగా పార్క్ లేక ఎక్సిబిషన్ కో తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగేది బుడగలు ఊదేది కావాలని.మనకు, మన పిల్లలకు అలాగే రాబోయే తరాలకు ఈ బుడగలతో ఎంతో అవినాభావ సంబంధం ఉంది.
ఆ బుడగలు గాలిలో ఎగురుతూ ఉంటే వాటిని చూసి పిల్లలు కేరింతలు కొట్టేవారు.అయితే అన్ని బుడగలు గాలిలో ఎగరలేవు.
కొన్ని మాత్రమే ఎగురుతాయి.మిగతావి పగిలిపోతాయి.
అలాగే బుడగలు కూడా చూడడానికి వివిధ రకాల రంగులతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.అయితే మనతో పాటు మన పిల్లలకు కూడా ఒక ఆలోచన మదిలో మెదులుతూ ఉంటుంది.
అసలు బుడగలు ఎలా ఏర్పడతాయి.ఒకవేళ ఏర్పడిన అవి గుండ్రగానే ఎందుకు ఉంటాయి అనే అనుమానం మనలో చాలా మందికి వచ్చే ఉంటుంది.
మరి బుడగలు ఏర్పడడానికి, అవి గుండ్రగానే ఉండడానికి గల కారణాలు ఏంటో చూద్దామా.నీళ్లలో సర్ఫ్ గాని, సబ్బుగాని వేసి బాగా గిలకొడితే బుడగలు తయారవుతాయి.నీరు అలాగే సబ్బుతో బుడగలు ఏర్పడినప్పుడు ఆ బుడగ మధ్యలో గాలి నిండి ఉంటుంది.అంటే సబ్బు ద్రావణంలో ఒక గొట్టం పెట్టి మనం గాలి ఊదుతాము కదా అప్పుడు మన నోటి నుంచి వచ్చిన వేడివేడి గాలి సబ్బునీటి పొరను ముందుకు నెట్టి, చివరకు దానితో తయారయ్యే బుడగలో బందీ అవుతుంది.
అలా బుడగలోని గాలి వేడిగా ఉంటుంది కాబట్టి ఆ బుడగ బయటి గాలితో తేలుతూ పైకి ఎగురుతుందన్నమాట.

అలా ఒకానొక సమయంలో బుడగ ఎగిరే కొద్ది అవిరైపోయి టప్ అని పగిలిపోతుంది.బుడగ పగిలినప్పుడే నీటి చుక్కలు కిందపడడాన్ని మీరు గమినించే ఉంటారు.అలాగే మనం ఊదే బుడగలు ఎందుకని గుండ్రంగా ఉంటాయంటే.
ఇలా నీరు, సబ్బు ద్రావణంతో ఊదే బుడగలలోని గాలి కొన్ని అణువులతో రూపొంది ఉంటుంది.మనం ఎప్పుడయితే బుడగలును ఊదుతామో అందులోని అణువులు అన్ని ఒకదానికొకటి సమాన శక్తితో తమ వైపునకు లాక్కుంటాయి కాబట్టి.
బుడగలు ఎప్పుడూ గుండ్రంగా ఉంటాయి.ఒక్కోసారి బుడగలు ఊదిన వెంటనే పగిలిపోతూ ఉంటాయి.
కానీ గాలి బుడగ దేనికీ ఢీ కొట్టు కోకుండా వున్నప్పుడు అలాగే దుమ్ము, ధూళి, వేడి లాంటివి తగలనట్లయితే అది కొన్ని వారాలపాటు పగిలిపోకుండా వుంటుందని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి.