మీ స్మార్ట్‌ ఫోన్‌ స్లో అవ్వడానికి ప్రధాన కారణాలు ఇవే... ఒక్కసారి ఇలా చేసి చూడండి, వేగం పెంచుకోండి  

Reasons That Why Smart Mobiles Get Slow-

పెరిగిన టెక్నాలజీ, మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో కూడా స్మార్ట్‌ ఫోన్‌లు వచ్చాయి.ఇండియాలో అత్యధికంగా స్మార్ట్‌ ఫోన్‌లు పెరిగి పోయాయి.గడిచిన నాలుగు సంవత్సరాల్లో స్టార్ట్‌ ఫోన్స్‌ కోట్లల్లో పెరిగిన నేపథ్యంలో పలు కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు పెడుతూ వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు...

Reasons That Why Smart Mobiles Get Slow--Reasons That Why Smart Mobiles Get Slow-

ఇక కొత్త కొత్త యాప్స్‌ పుట్టుకు వస్తున్నాయి.గేమ్స్‌, వీడియో స్ట్రీమింగ్స్‌, సోషల్‌ మీడియా యాప్స్‌ ఇలా ప్రతి ఒక్కరి ఫోన్‌లో కూడా పదికి తగ్గకుండా యాప్స్‌ ఉంటున్నాయి.రామ్‌ కెపాసిటీ ఎక్కువ ఉన్న ఫోన్స్‌ లో ఎన్ని యాప్స్‌ ఉన్న పర్వాలేదు.

కాని రామ్‌ కెపాసిటీ తక్కువ ఉన్న ఫోన్స్‌లో మాత్రం చాలా తక్కువ యాప్స్‌ను పెట్టుకోవడం బెటర్‌.

Reasons That Why Smart Mobiles Get Slow--Reasons That Why Smart Mobiles Get Slow-

రామ్‌ కెపాసిటీ ఎక్కువ ఉంటే ఫోన్‌ స్పీడ్‌ అధికంగా ఉంటుంది.అదే రామ్‌ కెపాసిటీ తక్కువగా ఉండి, యాప్స్‌ ఎక్కువగా ఉంటే ఫోన్‌ చాలా స్లో అవుతుంది.కొన్ని సార్లు ఫోన్‌ ఏం చేసినా రెస్పాన్స్‌ ఉండదు.

స్విచ్చాఫ్‌ చేయాల్సి ఉంటుంది.అలా ఇబ్బంది పడుతున్నారు అంటే మీ ఫోన్‌ లో రామ్‌ కెపాసిటీ కంటే అదనంగా యాప్స్‌ వాడుతున్నట్లుగా భావించొచ్చు.చాలా స్లోగా ఉన్న ఫోన్‌తో చాలా మంది చిరాకు పడుతూ ఉంటారు...

ఫోన్‌లో రామ్‌పై చాలా తక్కువ బారం ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ స్పీడ్‌తో ఫోన్‌ పని చేస్తుంది.

రామ్‌ పై ఒత్తిడి తగ్గించేందుకు ఇప్పుడు కొన్ని చిట్కాలు చూద్దాం…

ఫోన్‌లో వాల్‌ పేపర్‌ స్టాటిక్‌ పెడితే బెటర్‌, కొందరు రకరకాల వాల్‌ పేపర్స్‌ అంటూ పెడతారు.ముఖ్యంగా వీడియో వాల్‌పేపర్‌ పెట్టడం వల్ల రామ్‌పై చాలా భారం పడుతుంది.

ఫోన్‌లో నోటిఫికేషన్స్‌ను ఎప్పటికప్పుడు క్లీయర్‌ చేసుకోవాలి.

ఫోన్‌లోని క్యాప్చాను కూడా వెంటనే క్లీయర్‌ చేసుకోవాలి.

మనం ఏవైతే యాప్స్‌ ఓపెన్‌ చేశామో అవి అన్ని కూడా బ్యాక్‌ గ్రౌండ్‌లో రన్‌ అవుతూనే ఉంటాయి.అందుకే వాటన్నింటిని కూడా ఎగ్జిట్‌ కొట్టాలి లేదంటే అన్ని యాప్స్‌ను క్లోజ్‌ చేసుకోవాలి.

ఎప్పటికప్పుడు సీసీ క్లీనర్‌ లేదా మరేదైనా క్లీనర్‌తో బ్యాక్‌ గ్రౌండ్‌లో రన్‌ అవుతున్న యాప్స్‌కు సంబంధించిన డేటాను డిలీట్‌ చేయాలి.

సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్స్‌ ఆప్షన్‌ను ఎంచుకుని అందులో పలు యాప్స్‌ను ఓపెన్‌ చేసి క్లియర్‌ డేటా కొట్టాలి.

ప్రతి రోజు కూడా మొబైల్‌లో యాప్స్‌ను అవసరం మేరకు మాత్రమే వినియోగించాలి.

ప్రతి యాప్‌ను వినియోగించడం వల్ల స్లో అయ్యే అవకాశం ఉంది.