ఆ చిన్న పొరపాట్ల వల్లే ఎస్పీ బాలు చనిపోయారా..?

బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి గత నెల 5వ తేదీన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి కరోనా నుంచి కోలుకున్నా ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో నిన్న మధ్యాహ్నం చనిపోయారు.కొన్ని రోజుల క్రితం ఆయన వైరస్ నుంచి కోలుకున్నారని తెలియడంతో ఆయన త్వరలో పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని అభిమానులు సైతం బావించారు.

 Reasons For Sp  Bala Subramanyam Death, Sp  Bala Subramanyam, Tv Shows, Kerala C-TeluguStop.com

ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం బాలు ప్రత్యేకత.
అయితే చిన్న పొరపాట్లే బాలు ప్రాణం పోవడానికి కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కరోనా వైరస్ విజృంభిస్తూ ఉండటంతో ఎస్పీ బాలు తన పాటల ద్వారా సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.అయితే ఆ మహమ్మారి ఎస్పీ బాలును మనకు దూరం చేసింది.

కేరళలో కాన్సర్ట్ కు హాజరైన ఎస్పీ బాలు అక్కడ జరిగిన సంగీత విభావరిలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే వైరస్ బారిన పడ్డారు.
పాటలు పాడే సమయంలో ఆయన మాస్క్ ను ధరించలేదు.

సంగీత విభావరిలో భౌతిక దూరం పాటించకపోవడం వైరస్ వ్యాప్తికి కారణమైంది.ఈ సంగీత విభావరితో పాటు బాలు సామజవరగమన అనే టీవీ షోకు అటెండ్ అయ్యారని.

ఈ షోలో పాల్గొన్న చాలామందికి కూడా కరోనా నిర్ధారణ అయిందని.ఈ రెండు టీవీ షోలే బాలు తిరిగిరాని లోకాలకు వెళ్లడానికి కారణమయ్యాయని తెలుస్తోంది.
సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకున్న బాలు మరణం సంగీత ప్రియులను ఎంతో బాధిస్తోంది.వయస్సులో పెద్దవారు కావడంతో ఆయన వైరస్ నుంచి కోలుకున్నా ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి.

బాలు ఇక లేరన్న వార్తతో సంగీత ప్రపంచమే మూగబోయింది.మరోవైపు ఎంజీఎం ఆస్పత్రిలో ఎస్పీ బాలు 50 రోజుల చికిత్సకు బాగానే ఖర్చైందని ప్రచారం జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube