నోటినుంచి దుర్వాసన రావడానికి కారణాలు  

Reasons For Bad Breath -

నోటి దుర్వాసన చాలామందిని ఇబ్బందిపెడుతుంది.బయటకు సరిగా వెళ్ళలేరు, వెళ్ళినా ఎవరితోనూ ఆత్మవిశ్వాసంతో మాట్లాడలేరు.

పొరపాటుగా నోరు తెరిచినా, వారితోపాటు వారి ముందు ఉన్నవారు కూడా ఇబ్బంది పడాలి.మరి ఈ నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది? దీని వెనుక కారణాలు ఎంటో చుద్దాం.

Reasons For Bad Breath-Telugu Health-Telugu Tollywood Photo Image

* నోటి దుర్వాసన రావడానికి, మొదటి కారణంతో పాటు అతిముఖ్యమైన కారణం పళ్ళు సరిగా శుభ్రపరచకపోవడం.పళ్ళలో ఇరుక్కుపోయే ఆహార పదార్థాలు బ్యాక్టీరియాకు చోటునిస్తాయి.దాంతో దుర్వాసన రావడం మొదలవుతుంది.అలాగే నాలుకను సరిగా శుభ్రపరచకపోవడం కూడా నోటి దుర్వాసనకు కారణం.

* నీళ్ళు తక్కువగా తాగడం కూడా నోటి దుర్వాసనకు కారణమవుతుంది.నీరు తక్కువగా తాగితే నోరు పొడిగా ఉంటుంది.

దీంతో దుర్వాసన వస్తుంది.

* బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం కూడా నోటి దుర్వాసనకు కారణంగా చెబుతారు.

బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వలన కూడా నోరు డ్రైగా మారుతుంది.దాంతో క్రిములు మీ నోటి మీద దాడిచేస్తాయి.

కాబట్టి ఉదయాన్నే మంచి ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం.

* ప్రోటిన్స్ ఉండే ఆహారం ఎక్కువగా తీసుకున్నా, నొటి దుర్వాసన రూపంలో ఒక ఇబ్బంది రావొచ్చు.

ఎప్పుడైనా గమనించారా? చికెన్ ఎక్కువగా తింటే దుర్వాసన వస్తుంది.కాబట్టి ప్రోటీన్‌లు ఎక్కువగా ఉన్న అహారాన్ని మన పరిస్థితులు గమనించి తీసుకోవాలి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు