బాబ్రీ మసీదు కేసు : ఈ 5 కారణాల వల్ల వారికి క్లీన్‌ చీట్‌  

Reasons Behind Clean Chit in Babri Masjid Case, Babri Masjid Case, Babri Masjid demolition case, Special CBI court - Telugu Babri Masjid, Babri Masjid Case, Babri Masjid Demolition Case, Bjp, Cbi Court, Lk Adwani, Reasons Behind Clean Chit In Babri Masjid Case, Special Cbi Court, Telugu News

బాబ్రీ మసీదు కేసు 28 ఏళ్ల విచారణ తర్వాత నేడు తుది తీర్పు వెలువడింది.బీజేపీ అగ్రశ్రేణి నాయకులు ఎల్‌ కే అద్వానీ, మురళి మనోహర్‌ జోషి, ఉమా భారతిలు ఇంకా పలువురు ఈ కేసులో సుదీర్ఘ కాలం పాటు విచారణ ఎదుర్కొన్నారు.

TeluguStop.com - Reasons Clean Chit Babri Masjid Demolition Case

వారి రెచ్చగొట్టే స్పీచ్‌ వల్లే కరసేవకులు రెచ్చి పోయి పక్కనే ఉన్న బాబ్రీ మసీదును కూల్చి వేశారు అంటూ ముస్లీంలు ఇన్నాళ్లు వాదిస్తు వచ్చారు.తాజాగా ప్రత్యేక కోర్టు వారి వాదనను కొట్టి పారేసింది.

వారు మసీదు కూల్చేందుకు వెళ్తున్న వారిని ఆపేందుకు ప్రయత్నించారు తప్ప రెచ్చగొట్టేలా చేయలేదు.ఉద్దేశ్య పూర్వకంగా వారు స్పీచ్‌ ఇవ్వలేదు అంటూ కోర్టు తీర్పు వచ్చింది.

TeluguStop.com - బాబ్రీ మసీదు కేసు : ఈ 5 కారణాల వల్ల వారికి క్లీన్‌ చీట్‌-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కేసులో ఇన్ని రోజులు విచారణ ఎదుర్కొంటున్న వారు అంతా కూడా నిర్థోషులుగా ప్రకటించేందుకు కోర్టు అయిదు విషయాలను వెళ్లడించింది.అందులో మొదటిది వారు రెచ్చగొట్టినట్లుగా చెబుతున్న ఆడియో స్పష్టంగా లేదు.

రెండవది బాబ్రీ మసీదు కూల్చివేతకు ఎలాంటి ముందస్తు ప్రణాళిక వారు వేయలేదు.మూడు నింధితులుగా విచారణ ఎదుర్కొంటున్న వారికి వ్యతిరేకంగా స్పష్టమైన సాక్ష్యలు లేవు.

మసీదును కూల్చేందుకు సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నించగా వారిని ఆపేందుకు ప్రయత్నించినట్లుగా అర్థం అయ్యింది.చివరగా అయిదవ కారణంగా సీబీఐ అందించిన వీడియోలు మరియు ఆడియోలు ప్రామాణికంగా లేవు అంటూ కోర్టు పేర్కొంది.

ఈ అయిదు కారణాలు చూపించి బాబ్రీ కేసుతో వారికి ఎలాంటి సంబంధం లేదని ప్రత్యేక కోర్టు తీర్పును ఇచ్చింది.ఈ తీర్పుపై హిందువులు హర్షం వ్యక్తం చేస్తుండగా ముస్లీంలు కారాలు మిరియాలు నూరుతున్నారు.

#CBI Court #Lk Adwani #BabriMasjid #ReasonsBehind #Babri Masjid

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Reasons Clean Chit Babri Masjid Demolition Case Related Telugu News,Photos/Pics,Images..