కళాతపస్వి విశ్వనాథ్ వారసులు సినిమాల్లోకి రాకపోవడానికి కారణమిదేనా?

కళాతపస్వి కె.విశ్వనాథ్ టాలీవుడ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకులలో ఒకరనే సంగతి తెలిసిందే.

 Reasons Behind Vishwanath Children Not Interested In Movies Details, K Vishwanat-TeluguStop.com

మొన్న రాత్రి ఆయన అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు.అయితే కళాతపస్వి విశ్వనాథ్ వారసులు సినిమాల్లోకి రాకపోవడానికి కారణమేంటనే ప్రశ్నకు అభిమానులలో చాలామందికి సమాధానం తెలియదు.

గతంలో ఒక ఇంటర్వ్యూలో విశ్వనాథ్ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించడం గమనార్హం.

సినిమా వాళ్లం పిరికివాళ్లమని కోట్ల రూపాయలతో బిజినెస్ చేస్తామని విశ్వనాథ్ అన్నారు.

భయాలు, సెంటిమెంట్ల వల్లే ఎస్ లెటర్ తో వరుసగా సినిమాలు చేశానని ఆయన కామెంట్లు చేశారు.ఆపద్భావందవుడు ఈ సినిమాకు మాత్రం ఈ సెంటిమెంట్ ను మిస్ చేశానని విశ్వనాథ్ వెల్లడించారు.

కథ రాసుకునే సమయంలో నేను లిరిక్స్ కూడా రాస్తానని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

Telugu Vishwanath, Legendary, Tollywood-Movie

అలా నేను రాసిన పల్లవులను సినిమాలలో ఉంచిన సందర్భాలు ఉన్నాయని విశ్వనాథ్ పేర్కొన్నారు.కొన్ని పాటలు నేనే రాశానని అయితే పేరు మాత్రం వేసుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు.నేను పాటలు రాస్తానని చెబితే నేను జనాలు నమ్ముతారో లేదో అని అనిపించిందని విశ్వనాథ్ కామెంట్లు చేశారు.

నాకు పబ్లిసిటీ అనేది నచ్చదని ఆయన పేర్కొన్నారు.నా కుటుంబ సభ్యులు సినిమాల్లోకి రావడానికి నేను వాళ్లను ప్రోత్సహించలేదని విశ్వనాథ్ అన్నారు.

Telugu Vishwanath, Legendary, Tollywood-Movie

నా కుటుంబ సభ్యులు ఇక్కడ రాణిస్తారని నాకు అస్సలు నమ్మకం లేదని ఆయన కామెంట్లు చేశారు.ఈరోజుల్లో పైకి రావడం సులువు కాదని విశ్వనాథ్ తెలిపారు.టాలెంట్ ను గుర్తించే విషయంలో అప్పట్లో చాలామంది ఉండేవారని మనీ విషయంలో పేరు ప్రఖ్యాతుల విషయంలో ఇండస్ట్రీలో అనిశ్చితి ఉందని విశ్వనాథ్ అన్నారు.ఈ రీజన్ వల్ల మా పిల్లలను వేరే రంగాల్లో స్థిరపడేలా చేశానని విశ్వనాథ్ తెలిపారు.

విశ్వనాథ్ మరణం ఆయన ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతుందని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube