తెలివిగా దెబ్బకొట్టిన విష్ణు.. ప్రకాష్ రాజ్ తో ఆ తప్పులు చేయించడంతో?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.ఈసీ మెంబర్స్ విషయంలో ప్రకాష్ రాజ్ ఆధిక్యం కనబరిచినా అధ్యక్ష పదవి విషయంలో మాత్రం ప్రకాష్ రాజ్ కు ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదు.

 Reasons Behind Vishnu Success In Movie Artist Association Election, Maa Election-TeluguStop.com

హోరాహోరీగా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోరులో మంచు ఫ్యామిలీకే ‘మా’ పీఠం దక్కగా విష్ణు ఎన్నికల్లో కనీవిని ఎరుగని విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.

మంచు విష్ణు ప్రకాష్ రాజ్ ను తెలివిగా దెబ్బ కొట్టారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

నాలుగు రోజుల క్రితం వరకు సైలెంట్ గా ఉన్న మంచు విష్ణు పలువురు సినీ ప్రముఖులతో వీడియో బైట్లు రిలీజ్ చేయించి అధ్యక్షునిగా తెలుగువారు గెలిస్తే మాత్రమే అసోసియేషన్ సభ్యులకు మంచి జరుగుతుందని చెప్పించారు.మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా ఆ విమర్శల గురించి మంచు విష్ణు ఆచితూచి స్పందించారు.

Telugu Maa, Maa Result, Manchu Vishnu, Artist, Prakash Raj, Vishnu Artist, Vishn

నాగబాబు మెగా హీరోల సపోర్ట్ ప్రకాష్ రాజ్ కు మాత్రమే ఉందని చెప్పినా విష్ణు మాత్రం మెగా హీరోలలో తనకు ఎంతోమంది సన్నిహితులు ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రకాష్ రాజ్ మ్యానిఫెస్టోను ప్రకటించకపోవడం మైనస్ కాగా ప్రకాష్ రాజ్ చేస్తున్న తప్పులను గమనించి ఆ తప్పులు తన విషయంలో జరగకుండా విష్ణు జాగ్రత్త పడ్డారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ ఫోన్లు చేసి మద్దతు కోరడంతో పాటు తాను గెలిస్తే చేసే మంచి పనుల గురించి విష్ణు చెప్పుకొచ్చారు.

Telugu Maa, Maa Result, Manchu Vishnu, Artist, Prakash Raj, Vishnu Artist, Vishn

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం సొంత ఖర్చుతో భవనం కట్టిస్తానని చెప్పడం కూడా విష్ణుకు ప్లస్ అయింది.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ షిప్ ఫీజును తగ్గించడం, తెలుగు రాష్ట్రాల సీఎంలతో సత్సంబంధాలు ఉండటం, ప్రకాష్ రాజ్ పై తెలివిగా విమర్శలు చేయడం ద్వారా విష్ణు సులువుగా గెలుపొందారు.ప్రకాష్ రాజ్ మెగా ఫ్యామిలీ మినహా ఇతర సెలబ్రిటీల మద్దతు పొందడంలో ఫెయిల్ కావడం అతనికి మైనస్ అయింది.

ఈ ఎన్నికల ఫలితాల వల్ల భవిష్యత్తులో ప్రకాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు దూరంగా ఉండే ఛాన్స్ ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube