నటుడు వేణు సినిమాల్లో చేయకపోవడానికి అసలు కారణం ఇదేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరును సొంతం చేసుకున్న నటులలో తొట్టెంపూడి వేణు కూడా ఒకరు.సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోలలో ఒకరైన వేణు ఈ మధ్య కాలంలో సినిమాలలో ఎక్కువగా నటించడం లేదు.

 Reasons Behind Venu Not Acting In Movies-TeluguStop.com

నటుడిగా ఒక వెలుగు వెలిగిన వేణు ఎందుకు సినిమాలకు దూరంగా ఉన్నారనే ప్రశ్నకు ప్రేక్షకులకు జవాబు దొరకడం లేదు.యూట్యూబ్ ఛానెళ్లకు కూడా వేణు ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదనే సంగతి తెలిసిందే.

స్వయంవరం సినిమాతో సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వేణుకు ఆ తర్వాత కెరీర్ విషయంలో వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు.ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న వేణు హీరోగా కొంతకాలం బాగానే కెరీర్ ను కొనసాగించినా ఆ తర్వాత ఆఫర్లు తగ్గాయి.

 Reasons Behind Venu Not Acting In Movies-నటుడు వేణు సినిమాల్లో చేయకపోవడానికి అసలు కారణం ఇదేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం వేణు చిత్రరంగానికి పూర్తిస్థాయిలో దూరంగా ఉన్నారు.మొదట్లో ఇంజనీర్ కావాలని అనుకున్న వేణుకు ఆ తర్వాత సినిమాలపై ఆసక్తి కలిగింది.

భారతీరాజా డైరెక్షన్ లో ఒక సినిమాకు వేణు మొదట ఎంపిక కాగా ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.

Telugu Actor Venu, Interesting Facts, Not Acting, Ramachari Movie, Reasons Behind, Swayamvaram, Tollywood, Venu, Venu Movie Career, Venu Tottempudi, Venu Tottempudi Family, Venu Wife Anupama-Movie

దమ్ము సినిమాలో వేణు ఎన్టీఆర్ బావగా కనిపించారు.అన్ని రకాల పాత్రలు పోషించకపోవడం వేణుకు మైనస్ అయింది.రామాచారి అనే సినిమాలో వేణు చివరగా హీరోగా నటించగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.2001 సంవత్సరంలో వేణుకు పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Telugu Actor Venu, Interesting Facts, Not Acting, Ramachari Movie, Reasons Behind, Swayamvaram, Tollywood, Venu, Venu Movie Career, Venu Tottempudi, Venu Tottempudi Family, Venu Wife Anupama-Movie

వేణు భార్య అనుపమ మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేశారు.ప్రస్తుతం వేణు భార్యతో కలిసి వ్యాపారం చేస్తున్నారని తెలుస్తోంది.మంచి అవకాశాలు వస్తే తాను నటించడానికి సిద్ధమేనని వేణు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

వేణుకు మంచి పాత్రలు లభిస్తే మాత్రం త్వరలోనే వేణు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

#Venu Anupama #Ramachari #Swayamvaram #Venu #Venu Career

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు