వకీల్ సాబ్ హిట్టవ్వడానికి కారణం ఆమేనంట..?

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ వీక్ డేస్ లో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటివరకు 70 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించిన వకీల్ సాబ్ మరో 20 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తే హిట్ సినిమాల కేటగిరీలోకి చేరుతుందని చెప్పాలి.

 Reasons Behind Vakeel Saab Movie Got Hit Talk-TeluguStop.com

మరోవైపు ఈ నెలలో విడుదల కావాల్సిన లవ్ స్టోరీ, టక్ జగదీష్, విరాటపర్వం సినిమాలు వాయిదా పడ్డాయి.

ఈ సినిమాలు ఎప్పుడు రిలీజవుతాయో తెలియాల్సి ఉంది.

 Reasons Behind Vakeel Saab Movie Got Hit Talk-వకీల్ సాబ్ హిట్టవ్వడానికి కారణం ఆమేనంట..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరో నెల రోజుల వరకు పెద్ద సినిమాలు రిలీజయ్యే పరిస్థితి లేకపోవడంతో వకీల్ సాబ్ రాబోయే రోజుల్లో కూడా భారీగా కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.ఈ సినిమా హిట్ కావడానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ శృతిహాసన్ ఫ్యాన్స్ మాత్రం ఆమె వల్లే ఈ సినిమా హిట్టైందని కొత్త లాజిక్ ను తెరపైకి తెస్తుండటం గమనార్హం.

పవన్ కళ్యాణ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న సమయంలో గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కు జోడీగా శృతిహాసన్ నటించారు.

Telugu Flop Heroes, Hit Talk, Shruti Hassa, Shruti Sentiment, Vakeel Saab-Movie

ఆ సినిమా పవన్ ఫ్లాపులకు బ్రేక్ వేయడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ ఏడాది రిలీజైన క్రాక్ సినిమాకు ముందు రవితేజ నటించిన సినిమాలనీ ఫ్లాప్ అయ్యాయి. క్రాక్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ కాగా ఈ సినిమతో సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాతో శృతిహాసన్ రీఎంట్రీ ఇచ్చారు.

వకీల్ సాబ్ సినిమాకు ముందు పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు కూడా పెద్దగా హిట్ కాలేదు.

శృతిహాసన్ సెంటిమెంట్ వల్లే వకీల్ సాబ్ సినిమాకు హిట్ టాక్ వచ్చిందంటూ శృతి ఫ్యాన్స్ కామెంట్లు చేయడం గమనార్హం.

శృతి ఫ్యాన్స్ శృతి వల్లే సినిమా హిట్టైందని కామెంట్లు చేస్తుంటే మరోవైపు పవన్ ఫ్యాన్స్ మాత్రం వకీల్ సాబ్ సినిమాలో శృతి హాసన్ నటించిన సీన్లు తొలగించాలని ఆ సీన్లు సినిమాకు మైనస్ గా మారాయని కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

#Vakeel Saab #Shruti Hassa #Flop Heroes #Hit Talk

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు