టాలీవుడ్ పెద్ద సినిమాలన్నీ ఆగిపోయాయా.. నెమ్మదిగా సాగుతోందంటూ?

కరోనా థర్డ్ వేవ్ టాలీవుడ్ పెద్ద సినిమాలపై ప్రభావం చూపింది.కరోనా కేసులు ఊహించని స్థాయిలో పెరుగుతుండటంతో టాలీవుడ్ పెద్ద సినిమాలు అన్నీ వాయిదా పడ్డాయి.

 Reasons Behind Tollywood Big Budget Movies Postpone Details, Tollywood Movies, Corona Third Wave, Ntr, Koratala Siva, Balakrishna, Mahesh Babu, Sarkaru Vari Paata, Pushpa The Rule-TeluguStop.com

ఇప్పటికే పలు భారీ బడ్జెట్ సినిమాలకు రిలీజ్ డేట్లను ప్రకటించగా ఆ సినిమాలు ఆ తేదీలకు రిలీజ్ కావడం కష్టమేనని ప్రచారం జరుగుతోంది.ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మూవీ షూటింగ్ ఫిబ్రవరిలో మొదలు కావాల్సి ఉన్నా ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు.

పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్నకు చిత్రయూనిట్ నుంచి స్పష్టత రావడం లేదు.మహేష్ హీరోగా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట షూట్ లో మహేష్ బాబు మార్చి నెల నుంచి పాల్గొనే ఛాన్స్ ఉందని సమాచారం.

 Reasons Behind Tollywood Big Budget Movies Postpone Details, Tollywood Movies, Corona Third Wave, Ntr, Koratala Siva, Balakrishna, Mahesh Babu, Sarkaru Vari Paata, Pushpa The Rule-టాలీవుడ్ పెద్ద సినిమాలన్నీ ఆగిపోయాయా.. నెమ్మదిగా సాగుతోందంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

విదేశాల నుంచి తాజాగా భారత్ కు వచ్చిన ప్రభాస్ తర్వాత సినిమా షూటింగ్ ను ఎప్పటినుంచి మొదలుపెడతారో చూడాల్సి ఉంది.

బాలయ్య తర్వాత సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.చిరంజీవికి కరోనా నిర్ధారణ కావడంతో ఆయన ప్రస్తుతం నటిస్తున్న సినిమాల షూటింగ్ లు అన్నీ వాయిదా పడ్డాయని తెలుస్తోంది.పుష్ప ది రైజ్ సక్సెస్ తర్వాత బన్నీ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఫిబ్రవరి నెల నుంచి పుష్ప ది రూల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కావాల్సి ఉన్నా అనుకున్న ప్రకారం ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందో లేదో కచ్చితంగా చెప్పలేం.హీరో రవితేజ మాత్రమే ప్రస్తుతం వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్నారు.టాలీవుడ్ పెద్ద సినిమాల షూటింగ్ నెమ్మదిగా సాగుతుండటం గమనార్హం.

Reasons Behind Tollywood Big Budget Movies Postpone Details, Tollywood Movies, Corona Third Wave, Ntr, Koratala Siva, Balakrishna, Mahesh Babu, Sarkaru Vari Paata, Pushpa The Rule - Telugu Balakrishna, Corona Wave, Koratala Siva, Mahesh Babu, Pushpa Rule, Pushpa, Secrets, Tollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube