భార్య గొప్ప సింగరైనా థమన్ అవకాశాలు ఇవ్వకపోవడానికి అసలు కారణమిదే!

తెలుగులో అవకాశాల విషయంలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ కు పేరుంది.ఇతర మ్యూజిక్ డైరెక్టర్లతో కూడా థమన్ సన్నిహితంగా మెలుగుతారు.

 Reasons Behind Thaman Not Gave  Chances To His Wife  Details Here Goes Viral ,-TeluguStop.com

సాంగ్స్ విషయంలో, మ్యూజిక్ విషయంలో థమన్ కు ఎవరూ సాటిరారనే సంగతి తెలిసిందే.థమన్ సాంగ్స్ లో కొన్ని సాంగ్స్ కాపీ అని కామెంట్లు వినిపించినా థమన్ మాత్రం ఆ కామెంట్లను అస్సలు పట్టించుకోరు.

దర్శకనిర్మాతల కోరిక మేరకే కొన్నిసార్లు కాపీ సాంగ్స్ ను పెడతామని థమన్ చెబుతారు.

అయితే థమన్ భార్య కూడా సింగర్ అనే విషయం చాలా మందికి తెలియదు.

అయితే భార్యకు ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదనే ప్రశ్నకు థమన్ జవాబిస్తూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.ఫ్యామిలీ ప్యాకేజ్ అయిపోవడం నాకు నచ్చదని ప్రొడ్యూసర్లు నాపై కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆడియో కంపెనీలు నాపై కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాయని థమన్ తెలిపారు.

దర్శకనిర్మాతలు ఎవరితో పాడించాలని చెబితే వాళ్లతోనే పాడించాలని థమన్ పేర్కొన్నారు.

Telugu Directors, Music Thaman, Thaman Gave, Thaman, Tollywood-Movie

నా భార్య బాగా పాడుతుందనో నా సోదరి బాగా పాడుతుందనో వాళ్లకు ఛాన్స్ ఇవ్వలేనని థమన్ వెల్లడించారు.నన్ను నమ్మి దర్శకనిర్మాతలు ఛాన్స్ ఇస్తున్నారని నా కుటుంబం కావాలని నన్ను వాళ్లు బుక్ చేయడం లేదు కదా అని థమన్ పేర్కొన్నారు.ఏదైనా పాటకు నా భార్య గొంతు సూట్ అవుతుందని నమ్మితే నా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కు మొదటే చెబుతానని థమన్ వెల్లడించారు.

Telugu Directors, Music Thaman, Thaman Gave, Thaman, Tollywood-Movie

వాళ్లు ఓకే చెబితే నా భార్యతో పాడిస్తానని థమన్ పేర్కొన్నారు.ప్రతి సాంగ్ కు సంబంధించి నిర్మాత దర్శకునికి లిస్ట్ ఇస్తానని థమన్ అన్నారు.దర్శకనిర్మాతలు అప్రూవ్ చేసిన వాళ్లతో మాత్రమే పాడిస్తానని థమన్ కామెంట్లు చేశారు.నేను సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోనని ఫేమస్ సింగర్ అయినప్పటికీ దర్శకనిర్మాతలు ఒప్పుకుంటే మాత్రమే పాడిస్తానని థమన్ చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube