ఆ తప్పుల వల్లే స్టార్ హీరోగా ఎదగలేకపోయిన సుమంత్?

టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోల్లో సుమంత్ ఒకరు.నటించిన సినిమాల్లో తక్కువ సినిమాలే హిట్ అయినా నటించిన పాత్రకు పూర్తి న్యాయం చేస్తారని సుమంత్ కు పేరుంది .

 Reasons Behind Sumanth Failure In Movie Career, Hero Sumanth, Snehamante Idera,-TeluguStop.com

నాగేశ్వరరావు మనవడు, నాగార్జున మేనల్లుడు అయిన సుమంత్ కు బ్యాక్ గ్రౌండ్ బాగానే ఉన్నా భారీ విజయాలు మాత్రం దక్కలేదు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుమంత్ కెరీర్ లో అంతగా సక్సెస్ కాలేకపోవడానికి గల కారణాలను వెల్లడించారు.

తాను లైఫ్ లో చేసిన కొన్ని తప్పులే సక్సెస్ కు అవరోధాలుగా మారాయని సుమంత్ చెప్పుకొచ్చారు.నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా, ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉన్నా అనుకున్న స్థాయిలో హీరోగా ఎదగలేకపోవడానికి గల కారణాలను తెలిపారు.

నాగార్జునకు శివ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడంతో నాగార్జున సుమంత్ ను ఆర్జీవీ దర్శకత్వంలో ప్రేమకథ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

అయితే ఈ సినిమా అనుకున్న స్థాయి సక్సెస్ సాధించలేదు.

ఈ సినిమాను నిర్మించిన నాగార్జునకు నష్టాలే మిగిలాయి.ఆర్జీవీ టైటానిక్ సినిమాను ఫాలో అయ్యి ఈ సినిమాను తీయడం వల్లే సినిమా ఫ్లాప్ అయిందని క్లైమాక్స్ లో హీరో, హీరోయిన్ ను చంపేయడం కరెక్ట్ కాదని ఆర్జీవికి ముందుగానే చెప్పినా ఆయన వినిపించుకోలేదని సుమంత్ వెల్లడించారు.

నిజజీవితంలో మామా అల్లుళ్లమైన తాను, నాగార్జున స్నేహితులుగా నటించడం వల్లే స్నేహమంటే ఇదేరా ఫ్లాప్ అయిందని వెల్లడించారు.

స్నేహమంటే ఇదేరా సినిమా చేసి కెరీర్ లో చాలా పెద్ద తప్పు చేశానని తాను భావిస్తున్నానని సుమంత్ చెప్పుకొచ్చారు.

రాఘవేంద్రరావు బలవంతం వల్ల తాత నాగేశ్వరరావుతో కలిసి పెళ్లి సంబంధం సినిమాలో నటించానని ఆ సినిమా కూడా అనుకున్న స్థాయి ఫలితాన్ని అందుకోలేదని చెప్పారు.పవన్ “తొలిప్రేమ” , తరుణ్ “నువ్వే కావాలి”, నాగార్జున “నవ్వు వస్తావని”, రవితేజ “ఇడియట్ ” ఉదయ్ కిరణ్ “మనసంతా నువ్వే” సినిమాల్లో మొదట సుమంత్ కే హీరోగా అవకాశం వచ్చినా ఆ ఆఫర్లను రిజెక్ట్ చేయడం సుమంత్ కెరీర్ కు మైనస్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube