ఆ తప్పుల వల్లే సుమంత్ మూవీ ఫ్లాప్ అయిందా..?  

reasons behind sumanth kapatadhari movie flop,sumanth ,valtharu srinu ,kapata dari ,uppena movie ,kannda hit movie kapadari , - Telugu Flop Result, Kapatadari Success, Kaptadhari Movie, Reasons Behind Flop

ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాపుల వల్ల కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సుమంత్ హీరోగా నటించిన కపటధారి సినిమా ఈ నెల 19వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే.కన్నడలో కపటధారి హిట్ కాగా అదే సినిమా తమిళంలో కూడా విడుదలై అక్కడ కూడా హిట్ అనిపించుకుంది.

TeluguStop.com - Reasons Behind Sumanth Kapatadari Movie Flop

కానీ తెలుగులో మాత్రం ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవడంతో టాక్ బాగానే ఉన్నా సినిమా ఫ్లాప్ గా మిగిలింది.

కపటధారి సినిమా రిజల్ట్ సుమంత్ కు కూడా షాక్ అనే చెప్పాలి.

TeluguStop.com - ఆ తప్పుల వల్లే సుమంత్ మూవీ ఫ్లాప్ అయిందా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సినిమా ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న ఫీల్ తెలుగులో కనిపించలేదు.క్రైమ్ థ్రిల్లర్ లకు ఆదరణ బాగానే ఉన్నా కథనంలో వేగం లేకపోవడం సినిమాకు మైనస్ గా మారింది.

దర్శకుడు ఈ సినిమా కథను తెలుగు నేటివిటీకి తగిన విధంగా మార్పులు చేసి ఉంటే ఈ సినిమా ఫలితం మరో విధంగా ఉండేదని చెప్పవచ్చు.వీకెండ్ వరకు కపటధారి మూవీకి మోస్తరు కలెక్షన్లు వచ్చినా వీక్ డేస్ లో మాత్రం కపటధారి మూవీ బుకింగ్స్ దారుణంగా ఉన్నాయని తెలుస్తోంది.

Telugu Flop Result, Kapatadari Success, Kaptadhari Movie, Reasons Behind Flop-Movie

ఫిబ్రవరి 12న విడుదలైన ఉప్పెన సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుంటే కపటధారి మాత్రం ప్రేక్షకులను ఆకర్షించలేకపోయింది.సుమంత్ కథల ఎంపికలో జాగ్రత్త వహిస్తే మాత్రమే హీరోగా మళ్లీ బిజీ అయ్యే అవకాశం ఉంది.కపటధారి సినిమాతో పాటు విడుదలైన నాంది, చక్ర సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బాగానే కలెక్షన్లు రాబడుతున్నాయి.కపటధారి టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకర్షించినా సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో ఫలితం అందుకోలేదు.

సుమంత్ తరువాత సినిమా వాల్తేరు శీను హిట్ అయ్యే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ బాగానే ఉన్నా సినిమాల్లో బాగా నటిస్తాడని మంచి పేరు సుమంత్ సినిమాల్లో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడం గమనార్హం.

#Flop Result #ReasonsBehind

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు