ఆ విషయంలో తమన్నా హద్దులు దాటకపోవడానికి కారణమేంటో తెలుసా?

శ్రీ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైనా హ్యాపీ డేస్ సినిమాతోనే తమన్నాకు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో పాపులారిటీ దక్కింది.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమన్నాకు ఊహించని స్థాయిలో క్రేజ్ ను పెంచిందనే సంగతి తెలిసిందే.

 Reasons Behind Star Heroine Tamanna Not Interested In Hot Scenes Details, Tamann-TeluguStop.com

తన సినీ కెరీర్ లో తమన్నా యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతో కూడా కలిసి నటించారు.సక్సెస్ రేట్ తో సంబంధం లేకుండా తమన్నాకు సినిమా ఆఫర్లు చెప్పుకోదగ్గ స్థాయిలో వచ్చాయి.

చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా భాటియా పెళ్లికి దూరంగా ఉన్నారు.సినిమాల్లో తమన్నా గ్లామరస్ గానే కనిపిస్తున్నా ఎక్స్ పోజింగ్ విషయంలో మాత్రం తమన్నా ఎప్పుడూ హద్దులు దాటలేదు.

వయస్సు పెరుగుతున్నా యంగ్ గానే కనిపిస్తుండటం తమన్నాకు ప్లస్ అవుతోంది.తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా తమన్నాకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు ఉండటం గమనార్హం.

అయితే కిస్ సీన్లు, హాట్ సీన్ల గురించి తమన్నా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Telugu Bhola Shankar, Chiranjeevi, Hot, Tamanna, Tamanna Offers, Tollywood-Movie

ఇండస్ట్రీలో ఎవరూ ముద్దులు పెట్టాలని, హాట్ సీన్లు చేయాలని బలవంతపెట్టరని తమన్నా అన్నారు.ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా తమన్నా నటిస్తున్నారు.మీకు ఇష్టమైతే అలాంటి సన్నివేశాల్లో నటించడంలో తప్పు లేదని ఇష్టం లేకపోతే మాత్రం అలాంటి సన్నివేశాలకు దూరంగా ఉండాలని తమన్నా అన్నారు.

Telugu Bhola Shankar, Chiranjeevi, Hot, Tamanna, Tamanna Offers, Tollywood-Movie

హాట్ సీన్లు, కిస్ సీన్లు ఇష్టం లేకపోతే వద్దని చెప్పి సులభంగా తప్పించుకోవడం సాధ్యమేనని తమన్నా కామెంట్లు చేశారు.ఇష్టమైతే రొమాంటిక్ సీన్ల దిశగా అడుగులు వేయవచ్చని లేకపోతే కామ్ గా ఉండవచ్చని తమన్నా కామెంట్లు చేశారు.హద్దులు దాటకపోవడానికి అసలు కారణానికి సంబంధించి తమన్నా చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.తమన్నా ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళాశంకర్ సినిమాలో హీరోయిన్ రోల్ లో నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube