స్టార్ కపుల్ ధనుష్ ఐశ్వర్య విడిపోవటానికి అసలు కారణం ఇదేనా?

2021 సంవత్సరంలో చైతన్య సమంత విడిపోయి అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.చైసామ్ విడిపోవడం ఇటు చైతన్య అభిమానులకు అటు సమంత అభిమానులకు నచ్చలేదు.

 Reasons Behind Star Couple Dhanush Aishwarya Divorce Details, Hero Dhanush, Aishwarya, Dhanush Aishwarya Divorce, Kollywood Star Couples, Rajnikanth Daughter, Dhanush Divorce, Naga Chaitanya Samantha-TeluguStop.com

ఈ షాక్ నుంచి కోలుకోక ముందే కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్ ఐశ్వర్య విడిపోతున్నట్టు ప్రకటన చేశారు.నిన్న రాత్రి 11 గంటల సమయంలో ధనుష్ ఐశ్వర్య చేసిన ఈ ప్రకటన అభిమానులను షాక్ కు గురి చేసింది.

ధనుష్ ఐశ్వర్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే సంగతి తెలిసిందే.2004 సంవత్సరం నవంబర్ 18వ తేదీన వీళ్ల వివాహం జరిగింది.ధనుష్ సోదరికి ఐశ్వర్య ఫ్రెండ్ కాగా అలా ఏర్పడిన పరిచయం తర్వాత రోజుల్లో ప్రేమగా మారింది.ఈ దంపతులకు యాత్రా రాజా, లింగ రాజా పేర్లతో ఇద్దరు కొడుకులు ఉన్నారు.

 Reasons Behind Star Couple Dhanush Aishwarya Divorce Details, Hero Dhanush, Aishwarya, Dhanush Aishwarya Divorce, Kollywood Star Couples, Rajnikanth Daughter, Dhanush Divorce, Naga Chaitanya Samantha-స్టార్ కపుల్ ధనుష్ ఐశ్వర్య విడిపోవటానికి అసలు కారణం ఇదేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ధనుష్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు ఇతర భాషల్లో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.

ధనుష్, శృతి హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కిన 3 అనే సినిమాకు ఐశ్వర్య డైరెక్షన్ చేశారు.

ఒక హీరోయిన్ వల్ల ధనుష్, ఐశ్వర్య మధ్య విభేదాలు వచ్చాయని కొన్నేళ్ల క్రితం ప్రచారం జరిగింది.ఆ తర్వాతే ఈ జంట మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని అందువల్లే వీళ్లిద్దరూ విడిపోయారని కోలీవుడ్ మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.18 సంవత్సరాలు అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడం అభిమానులను షాక్ కు గురి చేస్తోంది.

ఎంతో అన్యోన్యంగా ఉన్న జంటలు వరుసగా విడిపోతూ ఉండటం గమనార్హం.చైసామ్ దారిలోనే ధనుష్ ఐశ్వర్య పయనించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.భవిష్యత్తులో ధనుష్ ఐశ్వర్య మనస్పర్ధలను తొలగించుకుని కలిసి జీవించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

భవిష్యత్తు కొరకు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి విడిపోతున్నామని ధనుష్ ఐశ్వర్య దంపతులు ప్రకటించడం గమనార్హం.

Reason behind Tamil actor Dhanush and Aishwarya divorce

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube