బాలు మృతికి అసలు కారణాలను వెల్లడించిన వైద్యులు..

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత నెల 5వ తేదీన కరోనా వల్ల ఆస్పత్రిలో చేరి కరోనా నుంచి కోలుకున్నా ఇతర అనారోగ్య సమస్యల వల్ల చనిపోయిన సంగతి తెలిసిందే.దీంతో పలువురు అభిమానులు బాలుకు కరోనా నెగిటివ్ వచ్చినా ఎస్పీ బాలు ఎందుకు చనిపోయారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

 Reasons Behind Sp Balasubrahmanyam Death, Sp Balasubrahmanyam, Sp Balasubrahmany-TeluguStop.com

దీంతో ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు బాలు చనిపోవడానికి గల అసలు కారణాలను వెల్లడించారు.

శ్వాసకోశ సమస్యలు, మెదడులో రక్తస్రావం బాలు చనిపోవడానికి కారణమయ్యాయని చెప్పారు.

చాలా రోజుల క్రితమే బాలు ఈ సమస్యలతో బాధ పడుతున్నాడని గమనించి చికిత్స చేశామని తీవ్రంగా శ్రమించినా అనుకూల ఫలితాలు రాలేదని పేర్కొన్నారు.ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు సభానాయగం, దీపక్‌ సుబ్రమణియన్ ఈ విషయాలను ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

బాలు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకునేవారని అందువల్ల ఆయన ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడలేదని తెలిపారు.ఏడు సంవత్సరాల క్రితం బరువు తగ్గడం కోసం బాలు ఆపరేషన్ చేయించుకున్నారని.

ఆ ఆపరేషన్ మినహా ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన ఆస్పత్రిలో చేరిన దాఖలాలు లేవని వైద్యులు పేర్కొన్నారు.కరోనా వైరస్ వల్ల బాలు మెదడులో రక్తస్రావం జరిగిందని వైద్యులు పేర్కొన్నారు.

కరోనా నెగిటివ్ వచ్చిన తరువాత బాలు అందరినీ గుర్తించగలిగారని.అకస్మాత్తుగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారిందని చెప్పారు.మెదడులో రక్తస్రావానికి తోడు శ్వాసకోస సమస్యలు ఏర్పడటంతో బాలును కాపాడలేకపోయామని వైద్యులు వెల్లడించారు.గత నెల 3వ తేదీన కరోనా లక్షణాలతో బాలు ఆస్పత్రికి వచ్చారని పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు.

ఆగష్టు 9వ తేదీన ఆక్సిజన్ అందక బాలు ఇబ్బంది పడ్డారని ఆగష్టు 14 నుంచి ఎక్మో పరికరం ద్వారా చికిత్స అందించామని చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube