బాలీవుడ్ ఇండస్ట్రీని సౌత్ సినిమా డామినేట్ చేయడానికి అసలు కారణాలు ఇవే!

ఒకప్పుడు తెలుగు సినిమాలు హిందీలో రిలీజైనా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించేవి కావు.తెలుగులో హిట్ టాక్ వచ్చిన సినిమాలు బాలీవుడ్ లో డిజాస్టర్లుగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి.

 Reasons Behind South Film Domination In Bollywood Industry Details, Bollywood In-TeluguStop.com

నాని, సమంత ప్రధాన పాత్రల్లో రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈగ సినిమా హిందీలో మక్కీ పేరుతో రీమేక్ కాగా హిందీలో ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.అయితే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ లో సత్తా చాటుతున్నాయి.

బాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలకు సమానంగా టాలీవుడ్ సినిమాలు కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయి.ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోని చాలామంది స్టార్ హీరోలు సరైన సక్సెస్ లేక కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు.

సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు ప్రాధాన్యత ఇవ్వకుండా కొందరు దర్శకులు తెరకెక్కిస్తున్న హిందీ సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి.

ఒకప్పుడు వరుస విజయాలను సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్ కు గత ఆరు సంవత్సరాలుగా సక్సెస్ లేదు.

Telugu Ameer Khan, Bahubali, Bollywood, Pushpa, Sahoo, Salman Khan, Sharukh Khan

వరుసగా విజయాలు సొంతం చేసుకున్న అమీర్ ఖాన్ కు సైతం ఈ మధ్య కాలంలో సక్సెస్ దక్కడం లేదు.మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన రాధే సినిమా కూడా ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది.సల్మాన్ ఖాన్ సినిమాలు రొటీన్ గా ఉంటున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Ameer Khan, Bahubali, Bollywood, Pushpa, Sahoo, Salman Khan, Sharukh Khan

మరోవైపు బాలీవుడ్ లో బాహుబలి సిరీస్, సాహో, పుష్ప ది రైజ్ సినిమాలు ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించాయి.బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సౌత్ సినిమా డామినేషన్ కొనసాగుతోంది.హిందీ హీరోలు, దర్శకులు కొత్త కథలపై దృష్టి పెడితే మాత్రమే హీరోలకు, దర్శకులకు మంచి ఫలితాలు దక్కే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

టాలీవుడ్ హీరోలు సైతం బాలీవుడ్ లో సత్తా చాటాలని పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube