నాగార్జున ఇంట్లో జరిగిన పార్టీకి దూరంగా సమంత.. అసలు కారణమిదేనా?

యంగ్ హీరో నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.నాగచైతన్య మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నారు.

 Reasons Behind Samantha Not Attending Love Story Celebration Party-TeluguStop.com

లవ్ స్టోరీ సక్సెస్ సెలబ్రేషన్స్ నాగార్జున ఇంట్లో జరగగా ఈ వేడుకకు నాగార్జున, నాగచైతన్య, సాయిపల్లవి హాజరయ్యారు.అయితే లవ్ స్టోరీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో సమంత కనిపించకపోవడం గమనార్హం.

గత కొన్నిరోజులుగా సమంత నాగచైతన్య మధ్య విభేదాలకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి రాగా సమంత, నాగచైతన్య ఆ వార్తల గురించి పరోక్షంగా స్పందిస్తున్నా పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వడం లేదు. అక్టోబర్ 7వ తేదీన నాగచైతన్య, సమంతల పెళ్లిరోజు అనే సంగతి తెలిసిందే.

 Reasons Behind Samantha Not Attending Love Story Celebration Party-నాగార్జున ఇంట్లో జరిగిన పార్టీకి దూరంగా సమంత.. అసలు కారణమిదేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టాలీవుడ్ క్యూట్ కపుల్ గా ఈ జోడీకి పేరుండగా ఈ జోడీ గురించి వస్తున్న వార్తలు అక్కినేని ఫ్యాన్స్ ను సైతం తెగ టెన్షన్ పెడుతున్నాయి.

అయితే అటు సమంత, ఇటు నాగచైతన్య తాము విడిపోతున్నామని ఎక్కడా వెల్లడించలేదు కాబట్టి ఈ వార్తల్లో నిజం లేకపోవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఒకవేళ చైతన్య సమంతల మధ్య మనస్పర్ధలు వచ్చినా త్వరలోనే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.సమంత, చైతన్య మధ్య ఉన్న విభేదాల వల్లే ఆమె ఈ పార్టీకి హాజరు కాలేదని వినిపిస్తోంది.

Telugu Interesting Facts, Love Story Celebration, Not Attending, Samantha-Movie

ప్రేమనగర్ సినిమా రిలీజైన రోజునే లవ్ స్టోరీ రిలీజ్ కావడం, ఆ సినిమాలా లవ్ స్టోరీ మూవీ కూడా బ్లాక్ బస్టర్ కావడం గమనార్హం.మరోవైపు నాగచైతన్య ప్రస్తుతం బంగార్రాజు సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో చైతన్య బాలరాజు పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.నాగచైతన్య, సమంత కలిసి నటిస్తే బాగుంటుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నా ఇప్పట్లో వీళ్లిద్దరూ కలిసి నటించడం కష్టమేనని సమాచారం.

#Samantha #Love Story

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు