సలార్ రిలీజ్ డేట్ ప్రకటనకు అసలు కారణం ఇదా..?

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్ లో సలార్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ కొత్తగా చూపించబోతున్నారని ప్రభాస్ ఛత్రపతిని మించి మాస్ అంశాలు ఈ మూవీలో పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది.నిన్న ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

 Reasons Behind Prabhas Salaar Movie Release Date Announcement, Salaar Movie, Rel-TeluguStop.com

2022 సంవత్సరం ఏప్రిల్ నెల 14వ తేదీన సలార్ సినిమాను విడుదల చేయబోతున్నట్టు సలార్ మూవీ మేకర్స్ ప్రకటన చేశారు.పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల కానున్నట్టు మొదట్లో ప్రచారం జరిగినా సమ్మర్ కే విడుదల చేయాలని మూవీ మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.అయితే విడుదలకు సంవత్సరం సమయం ఉన్నా ఇంత త్వరగా రిలీజ్ డేట్ ను చిత్రయూనిట్ ప్రకటించడం వెనుక అసలు కారణం వేరే ఉందని సమాచారం.

Telugu Hombale, Kgf, Prashanth Neel, Salaar-Movie

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పైనే సలార్ మూవీ కూడా తెరకెక్కుతోంది.ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా ఈ సినిమాను భారీ మొత్తంలో అడ్వాన్స్ లు తీసుకుని తెలుగులో కేజీఎఫ్ 2 నిర్మాతలే విడుదల చేస్తున్నారని సమాచారం.ఇప్పటికే నైజాం ఏరియాకు భారీ మొత్తం అడ్వాన్స్ తీసుకున్నారని ఇతర ఏరియాల అడ్వాన్స్ ల కోసం సలార్ మూవీ రిలీజ్ డేట్ హడావిడిగా ప్రకటించారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

సలార్ రిలీజ్ డేట్ ప్రకటన వల్ల కేజీఎఫ్ 2 ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోకపోతే ఆ డిస్ట్రిబ్యూటర్లకే నిర్మాతలు సలార్ హక్కులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

సలార్ రిలీజ్ డేట్ ప్రకటనతో కేజీఎఫ్ 2 ఇతర ఏరియాల హక్కులు కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube