ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కు నామినేట్ కాకపోవడానికి అసలు రీజన్ ఇదే!

ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయ్యి ఉంటే బాగుండేదని చరణ్, తారక్ అభిమానులతో పాటు జక్కన్న అభిమానులు సైతం భావించారు.అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమాకు ఆస్కార్ కు నామినేట్ కాలేదని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

 Reasons Behind  Rrr Not Selected For Oscar Nominations Details Here , Rrr , Osca-TeluguStop.com

అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కు నామినేట్ కాకపోవడానికి అసలు రీజన్ వెలుగులోకి వచ్చింది.జ్యూరీ సభ్యులలో ఒకరు చేసిన కామెంట్ల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని సమాచారం.

ఆర్ఆర్ఆర్ మూవీలో హిస్టరీని ఫాంటసీ చేశారని అయితే ఆర్ఆర్ఆర్ ను ఫాంటసీ మూవీ అనుకుంటే సినిమాలో వ్యక్తుల పేర్లను, స్థలాల పేర్లను మార్చలేదని అభిప్రాయం వ్యక్తమైందని బోగట్టా.ఈ సినిమా చరిత్రను వక్రీకరించిన సినిమా అని ఈ సినిమాను ఆస్కార్ నామినేషన్స్ కు పంపితే మన చరిత్రను మనమే కించపరచుకున్నట్టు అవుతుందని జ్యూరీ సభ్యుడు కామెంట్లు చేయగా మిగతా వాళ్లు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది.

Telugu Chhello Show, Oscar, Raja Mouli, Ram Charan-Movie

చరిత్రకారుల నుంచి ఈ సినిమా విషయంలో నెగిటివ్ కామెంట్లు వినిపించే ఛాన్స్ ఉందనే ఆలోచనతోనే ఈ సినిమాను ఆస్కార్ కు నామినేట్ చేయలేదని బోగట్టా.జ్యూరీ సభ్యులు చివరకు ఛెల్లో షోను ఎంపిక చేయడం జరిగింది.చివరకు ఛెల్లో షో సినిమాను ఎంపిక చేయడంపై నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.ఈ సినిమా ఆస్కార్ కు ఎంపికైన విదేశీ సినిమాకు ఫ్రీమేక్ కావడం గమనార్హం.

ఛెల్లో షో సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చినా జ్యూరీ సభ్యులు నిర్ణయాన్ని మార్చుకోలేదు.ఛెల్లో షో సినిమాను ఆస్కార్ కు నామినేట్ చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ మూవీని ఆస్కార్ కు పంపి ఉంటే జ్యూరీ సభ్యులకు ఈ విమర్శలు తప్పి ఉండేవి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube