ఆ హీరోతో అందుకే నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన రష్మిక..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రెండు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో నటిస్తున్న రష్మిక డేట్స్ క్లాష్ కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 Reasons Behind Rashmika Rejected Jersey Movie Role-TeluguStop.com

అయితే రష్మికకు బాలీవుడ్ లో ఈ రెండు సినిమాలకు ముందే షాహిద్ కపూర్ కు జోడీగా నటించే అవకాశం దక్కింది.నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కిన జెర్సీ తెలుగులో హిట్టైన సంగతి తెలిసిందే.

గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను షాహిద్ కపూర్ తో హిందీలో రీమేక్ చేస్తుండగా ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.అయితే జెర్సీ హిందీ సినిమాలో నటించకపోవడం గురించి ప్రశ్నలు ఎదురు కాగా రష్మిక స్పందించి ఆ సినిమాలో నటించకపోవడానికి గల కారణాలను వెల్లడించారు.

 Reasons Behind Rashmika Rejected Jersey Movie Role-ఆ హీరోతో అందుకే నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన రష్మిక..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగులో జెర్సీ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతంగా నటించారని ఆమె ఆ పాత్రకు న్యాయం చేశారని రష్మిక అన్నారు.

Telugu Rashmika Mandanna, Reasons Behind, Rejected Jersey, Shahid Kapoor-Movie

శ్రద్ధా శ్రీనాథ్ కంటే గొప్పగా ఆ పాత్రలో ఎవరూ నటించలేరని భావించి ఆ సినిమాలో నటించడానికి తాను గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని హిందీ జెర్సీ సినిమాను రిజెక్ట్ చేయడం వెనుక అసలు కారణాన్ని రష్మిక వెల్లడించారు.ఈ సినిమాలో షాహిద్ కపూర్ కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు.అయితే రష్మిక షాహిద్ కపూర్ కు జోడీగా నటించకపోవడానికి చెప్పిన రీజన్ నమ్మశక్యంగా లేదని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

జెర్సీ సినిమాలో పిల్లాడికి తల్లిగా నటించాల్సి ఉండటంతో రష్మిక ఆ పాత్రను రిజెక్ట్ చేసి ఉండవచ్చని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.రష్మిక ప్రస్తుతం హిందీలో గుడ్ బై సినిమాతో పాటు మిషన్ మజ్ను సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

తెలుగులో పుష్ప మూవీతో పాటు శర్వానంద్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు.

#Rejected Jersey #Reasons Behind #Shahid Kapoor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు