రామ్ చరణ్ సైలెన్స్ వెనుక అసలు కారణం ఇదే..?

మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తొలి సినిమాతోనే నటుడిగా ప్రూవ్ చేసుకుని స్టార్ హీరోగా ఎదిగాడు రామ్ చరణ్.ఆ సినిమా తరువాత వరుస విజయాలు రామ్ చరణ్ రేంజ్ ను పెంచాయి.

 Reasons Behind Ram Charan Silence About Next Projects  Ramcharan, Rajamouli, Rrr-TeluguStop.com

స్టార్ డైరెక్టర్లతో వరుస సినిమాలు ప్లాన్ చేసుకుని అంచనాలను మించి విజయాలను సొంతం చేసుకున్నారు రామ్ చరణ్.ప్రస్తుతం చరణ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా తరువాత రామ్ చరణ్ నటించబోయే సినిమా గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నా అధికారిక ప్రకటనలు మాత్రం వెలువడటం లేదు.అయితే రామ్ చరణ్ సైలెన్స్ వెనుక అసలు కారణం వేరే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

పదేళ్ల క్రితం రామ్ చరణ్ రాజమౌళి కాంబినేషన్ లో మగధీర సినిమా తెరకెక్కగా ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

అయితే మగధీర తరువాత విడుదలైన ఆరెంజ్ సినిమా వల్ల ఆ పేరు మొత్తం పోయింది.

దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఆ తప్పు రిపీట్ కాకుండా కథల విషయంలో చరణ్ ఆచితూచి అడుగులేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమాతో వచ్చే క్రేజ్ ను మరింత పెంచే విధంగా తరువాత సినిమా ఉండాలని ఇప్పటికే అలాంటి కథలే చెప్పాలని దర్శకులకు, రచయితలకు రామ్ చరణ్ సూచిస్తున్నాడని సమాచారం.

ముఖ్యంగా పాన్ ఇండియా కథలపై రామ్ చరణ్ దృష్టి పెట్టారని సమాచారం.రాజమౌళి సినిమాలో హీరోగా నటిస్తే తరువాత సినిమా ఫ్లాప్ అవుతుందని ఇండస్ట్రీలో చాలామంది నమ్ముతున్నారు.

రామ్ చరణ్ తన తరువాత సినిమాతో ఆ సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేయనున్నారని తెలుస్తోంది.చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.కొరటాల శివ లేదా త్రివిక్రమ్ దర్శకత్వంలో చరణ్ నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube