సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతిబాబులా రాజశేఖర్ సత్తా చాటకపోవడానికి కారణాలివే!

ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలని ప్రయత్నాలు చేస్తుండగా సినిమాలలో సక్సెస్ అయిన వాళ్ల సంఖ్య చాలా తక్కువనే సంగతి తెలిసిందే.ఎక్కువ సంవత్సరాలు నటుడిగా కెరీర్ ను కొనసాగించాలన్నా సులువైన విషయం కాదు.

 Reasons Behind Rajasekhar Failure In Second Innings Details Here Goes Viral In S-TeluguStop.com

అయితే జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే.మంచి పాత్రలను ఎంచుకుంటున్న జగపతి బాబుకు ఆ పాత్రలతో విజయాలు కూడా దక్కుతున్నాయి.

Telugu Jagapathi Babu, Rajasekhar, Senior Heroes, Srikanth, Tollywood-Movie

విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడంతో పాటు తన పాత్రకు ప్రత్యేకత ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం జగపతిబాబుకు ప్లస్ అయింది. శ్రీకాంత్ కూడా జగపతిబాబు తరహాలో విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటున్నా ఆయన స్థాయిలో విజయాలు మాత్రం దక్కడం లేదు.అయితే మరో సీనియర్ హీరో రాజశేఖర్ మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో సత్తా చాటే విషయంలో ఫెయిలవుతున్నారు.

రాజశేఖర్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంటున్నాయి.

రాజశేఖర్ సినిమాలు పలు వివాదాల్లో చిక్కుకోవడం కూడా ఆయనకు కెరీర్ పరంగా కొంతమేర మైనస్ అయిందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి అంగీకరించకపోవడంతో ఆయనకు సినీ ఆఫర్లు తగ్గుతున్నాయి.

Telugu Jagapathi Babu, Rajasekhar, Senior Heroes, Srikanth, Tollywood-Movie

టాలీవుడ్ స్టార్స్ సినిమాలలో అవకాశాలు వస్తున్నా రాజశేఖర్ వాటిని రిజెక్ట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.రాజశేఖర్ ఇవే తరహా పొరపాట్లను రిపీట్ చేయడం ఆయన సినీ కెరీర్ పరంగా, ఆర్థికంగా నష్టపోతున్నారు.ఈ విషయాలను గ్రహించి ఆయన కెరీర్ పరంగా తప్పులు చేయకుండా ఉంటే బాగుంటుందని కొంతమంది చెబుతున్నారు.రాజశేఖర్ ఇప్పుడు మంచి పాత్రలను వదులుకుంటే రాబోయే రోజుల్లో ఎంత కష్టపడినా కెరీర్ పరంగా విజయాలను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉండవని చెప్పవచ్చు.

రాజశేఖర్ కు ఈ జనరేషన్ ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube