ఆర్ నారాయణమూర్తి పెళ్లికి వాళ్లు ఒప్పుకోలేదట.. అసలేం జరిగిందంటే..?

నటుడిగా, నిర్మాతగా, హేతువాదిగా, డైరెక్టర్ గా ఆర్ నారాయణమూర్తి మంచి పేరును సొంతం చేసుకున్నారు.కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు వచ్చినా ఆ ఆఫర్లకు నో చెబుతూ తను నమ్మిన సిద్ధాంతాలనే సినిమాలుగా తెరకెక్కిస్తూ జయాపజయాలతో సంబంధం లేకుండా నారాయణ మూర్తి కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

 Reasons Behind R Narayana Murthy Not Interested About Marriage-TeluguStop.com

అయితే నారాయణమూర్తి పెళ్లి చేసుకోలేదనే సంగతి తెలిసిందే.ఒక సందర్భంలో తనకు పెళ్లి చేసుకోవాలని అనిపించిందని నారాయణ మూర్తి అన్నారు.

పెళ్లి చేసుకోకపోవడం గురించి నారాయణమూర్తి స్పందిస్తూ ఎవరో పలానా అమ్మాయిని తాను పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని మా పేరెంట్స్ ఒప్పుకోలేదని నారాయణమూర్తి తెలిపారు.అక్కడ తనకు, పేరెంట్స్ కు క్లాష్ వచ్చిందని నారాయణమూర్తి చెప్పుకొచ్చారు.

 Reasons Behind R Narayana Murthy Not Interested About Marriage-ఆర్ నారాయణమూర్తి పెళ్లికి వాళ్లు ఒప్పుకోలేదట.. అసలేం జరిగిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాను లవ్ చేయలేదని అయితే పెళ్లి చేసుకుందామని అనుకున్నానని నారాయణమూర్తి తెలిపారు.కులపరమైన సమస్యలు ఉండటం వల్ల పెళ్లి జరగలేదని నారాయణ మూర్తి అన్నారు.

పేరెంట్స్ ను ఎందుకు ఇబ్బంది పెట్టాలని తనకు అనిపించిందని నారాయణమూర్తి చెప్పుకొచ్చారు.ఆ అమ్మయికి తాను అన్యాయం చేయలేదు కాబట్టి తాను కూడా రాజీ పడలేదని నారాయణమూర్తి అన్నారు.అదే సమయంలో సినిమా పిచ్చి ఉండేదని నారాయణమూర్తి చెప్పుకొచ్చారు.పెళ్లి చేసుకోనందుకు కన్నీళ్లు పెట్టుకున్నానని, పశ్చాత్తాపపడ్డానని నారాయణమూర్తి తెలిపారు.

జాబ్ వచ్చే వరకు ఆగి పెళ్లి చేసుకోవాలని అనుకోవద్దని నారాయణమూర్తి చెప్పారు.జీవితం చాలా గొప్పదని నారాయణమూర్తి అన్నారు.తనది అసంపూర్ణ జీవితమని పరిపూర్ణ జీవితం కాదని నారాయణమూర్తి చెప్పుకొచ్చారు.భార్యాభర్తల సంఘం గొప్పదని తనలా ఎవరూ దురదృష్టవంతులు కావద్దని నారాయణమూర్తి తెలిపారు.ఇటీవల మా నాన్న చనిపోయారని 95 సంవత్సరాల వయస్సులో చనిపోయారని అమ్మ వయస్సు 85 సంవత్సరాలని నారాయణమూర్తి వెల్లడించారు.నా మనస్సుకు ఎలా అనిపిస్తే అలా చేయాలని అమ్మ చెప్పేవారని నారాయణమూర్తి పేర్కొన్నారు.

#RNarayana #RNarayana #Movies #Caste Feeling #Marriage

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు